ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ ఫీజుల ఖరారు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్ తదితర పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు ట్యూషన్ ఫీజులను ఖరారు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర సోమవారం ఉత్తర్వులిచ్చారు.
2019-20, 2020-21-23 విద్యా సంవత్సరాలకు ఫీజులు ఖరారు చేస్తూ వేర్వేరు జీవోలు విడుదల చేశారు. ఎంబీఏలో 329 కాలేజీలకు, ఎంసీఏలో 113 కాలేజీలు, ఎంటెక్‌లో 231 కాలేజీలకు, ఎం.ఫార్మసీలో 107 కాలేజీలకు, ఫార్మా-డీలో 59 కాలేజీలకు, ఫార్మా పీబీలో 31 కాలేజీలకు 2019-20 విద్యా సంవత్సరపు ఫీజులు ఖరారు చేశారు. 2020-21 నుంచి 2022-23 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి ఎంబీఏలో 315 కాలేజీలు, ఎంసీఏలో 106 కాలేజీలు, ఎంటెక్‌లో 225 కాలేజీలు, ఎం.ఫార్మసీలో 110 కాలేజీలు, ఫార్మా-డీలో 60 కాలేజీలు, ఫార్మా పీబీలో 33 కాలేజీలకు ఫీజులను ఖరారు చేశారు.
Published date : 19 Jan 2021 04:02PM