డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్ గడువు పొడిగింపు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ రెండో విడత గడువును రెండు రోజులపాటు (12వ తేదీ వరకు) పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ వర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలలో డిప్లొమో పూర్తి చేసిన విద్యార్థులకు సంబంధిత డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నెం.17) జారీ చేయడంతో కౌన్సెలింగ్ గడువును పొడిగించినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపుతో రెండో విడత సీట్ల కేటాయింపును 16న చేపట్టనున్నట్లు తెలిపారు.
Published date : 11 Feb 2021 04:05PM