భారత్ బంద్: జేఎన్‌టీయూహెచ్‌లో నేడు జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: భారత్ బంద్ నేపథ్యంలో మంగళవారం నిర్వహించే పలు పరీక్షలను వర్సిటీలు వాయిదా వేశాయి.
ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం నాటి పరీక్షలన్నింటినీ వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొ. మంజూర్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను డిసెంబర్10న నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 8 నాటి పాలిటెక్నిక్ డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఎస్‌బీటీఈటీ కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 23న నిర్వహిస్తామన్నారు. సీపీజీఈటీ పరీక్షను వాయిదా వేసినట్లు ఉస్మానియా వర్సిటీ వెల్లడిం చింది. తమ పరిధిలో ఈ నెల 8న జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశామని, డిసెంబర్9 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా ఉంటాయంది. అలాగే, భారత్ బంద్ నేపథ్యంలో కాళోజి హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మంగళవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. వాయిదా పడిన బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ సెకండియర్ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఈ నెల 9న జరిగే పరీక్షలన్నీ యథాతథంగా కొనసాగుతాయని వెల్లడించింది.
Published date : 08 Dec 2020 04:34PM