Skip to main content

బయోడైవర్సిటీలో డెహ్రాడూన్ ఫారెస్ట్ వర్సిటీ పరీక్ష

సాక్షి,హైదరాబాద్: డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కోర్సు ప్రవేశ పరీక్షకు హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోడైవర్సిటీని పరీక్షా కేంద్రంగా ఎంపిక చేశారు.
ఈ మేరకు రాష్ట్ర ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డీన్ డా.జి. చంద్రశేఖర్‌రెడ్డికి డెహ్రాడూన్ ఫా రెస్ట్ వర్సిటీ రిజిస్ట్రార్ ఓ లేఖ ద్వారా సమాచారం పంపా రు. మే 10వ తేదీన దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రా ల్లో నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్ష కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసినట్లు రిజిస్ట్రార్ చెప్పారు. ఇప్పటివరకు ఈ ప్రవేశ పరీక్ష రాసేందుకు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు చెందిన వారు బెంగళూరు లేదా కోయంబత్తూరుకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. హైదరాబాద్‌లో సెంటర్ ఏర్పాటుకు సానుకూల స్పందన రావడంపై ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
Published date : 24 Jan 2020 01:40PM

Photo Stories