Skip to main content

బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ‘ఆడపిల్లలే’ ఎక్కువ..!

సాక్షి, బెంగళూరు: గతంలో బాలికలు, యువతులు చదువుకోవాలంటే ఎన్నో అడ్డంకులు.. కానీ ప్రస్తుతం కాలం మారింది.
ఐటీ నగరి బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో విద్యార్థినులే ఎక్కువగా ఉన్నారు. ఆడ పిల్లలకు మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ముందుకు వస్తున్నారు. కేవలం నగరానికి చెందిన యువతులే కాకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ముందుకు వస్తున్నారు. మెడికల్‌ కాలేజీల్లో అబ్బాయిలు 40 శాతం ఉండగా, అమ్మాయిలు ఏకంగా 60 శాతం మంది చదువుకుంటున్నారు. డెంటల్‌ విద్యను 70 శాతం మంది అమ్మాయలు చదువుతున్నారు. అయితే ఇంజనీరింగ్‌లో మాత్రం విద్యార్థినుల భాగస్వామ్యం తక్కువగా ఉంది. 1980–90 సమయంలో 10 శాతం మంది విద్యార్థినులు చదువుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. యువకుల కంటే ఆడపిల్లలే ఎక్కువగా చదువుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఆడపిల్లల చదువు కోసం పలు కార్యక్రమాలు, రాయితీలు చేస్తోంది. కుటుంబ సభ్యులు కూడా తమ ఆడపిల్లల చదువుకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తున్నారు. 50 శాతం పీజీ కోర్సుల్లో అమ్మాయిలే ఉన్నారు. వ్యవసాయ విద్యలో యువతులు ఉత్సాహం కనబరుస్తున్నారు. అలాగే చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌ అందిస్తుండడం వల్ల ఎక్కువగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు..

ఏడాది

పురుషులు

స్త్రీలు

మొత్తం

2017–18

6,386

6,863

13,249

2018–19

3,521

3,496

7,017

2019–20

2,447

3,702

7,149

Published date : 12 Apr 2021 04:56PM

Photo Stories