ఆర్థిక సాయం కోసం 2.06 లక్షల దరఖాస్తులు చేసుకున్న ప్రైవేటు పాఠశాలల సిబ్బంది..!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి అందించనున్న సహాయం కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
రూ. 2 వేల ఆర్థికసాయం, 25 కిలోల బియ్యం కోసం ప్రైవేటు స్కూళ్లలో పని చేసే బోధన, బోధనేతర సిబ్బంది దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు గురువారంతో ముగిసింది. గురువారం రాత్రి వరకు 2,06,345 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,53,525 మంది బోధన సిబ్బంది ఉండగా.. 52,820 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. విద్యాశాఖ వద్ద ఉన్న లెక్కల్లో 1.37 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నట్లు పేర్కొనగా.. ఇప్పుడు వాస్తవ సంఖ్య 2,06,345కు చేరింది. దీంతో విద్యాశాఖ వద్ద ఉన్న లెక్కలకు మించి ప్రైవేటు స్కూళ్లలో సిబ్బంది ఉన్నట్లు తేలింది.
Published date : 16 Apr 2021 04:40PM