AP State Best Teacher Awards 2021: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఏటా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం నాడు గురుపూజోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం 15 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారు దరఖాస్తులు అందించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 29, 30, 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో సంబంధిత జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో దరఖాస్తులు అందించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని సెలెక్షన్ కమిటీ ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రాష్ట్ర స్థాయికి సిఫార్సు చేస్తుందని వెల్లడించారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి సెప్టెంబర్ 5న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల్లో, మండలాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.
Published date : 30 Aug 2021 03:28PM