Skip to main content

ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో 2021–22 ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నిమ్మకూరు (పామర్రు): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహా్వనిస్తున్నామని నిమ్మకూరు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ కేవీ జగన్నాధరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా నిమ్మకూరు (బాల,బాలికలకు), విజయనగరం జిల్లా తాటిపూడి(బాలికలు), గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌ (బాలురు), నెల్లూరు జిల్లా వెంకటగిరి (బాలురు), గుంటూరుజిల్లా గుంటూరు (మైనార్టీ బాలురు) జూనియర్‌ కళాశాలలున్నాయని తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌ (బాలురు), కర్నూలు జిల్లా కర్నూలు (బాల, బాలికలు) ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల్లో 2021–22 ఏడాదికి ప్రవేశం కోసం దరఖాస్తులు కోరుతున్నామని తెలిపారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను జూలై 15వ తేదీ లోపు హెచ్‌టీటీపీఎస్‌// ఏపీఆర్‌ఎస్‌. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌ ద్వారా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని తెలిపారు. వివరాలకు 7093323253, 9676404618, 9866559725 లో సంప్రదించాలని సూచించారు.

రెండేళ్లలోనే 1.83 లక్షల ఉద్యోగాలు: విద్యారంగ ప్రక్షాళన తర్వాత మరిన్ని ఖాళీల భర్తీ..

స్కూళ్లకు 200 మీటర్ల దూరం వరకు ఉన్న సిగరెట్, పాన్‌ షాపులన్నీ క్లోజ్‌!

జూలైలోనే సీఏ– 2021 పరీక్షలు నిర్వహిస్తాం

2000 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్..!
Published date : 30 Jun 2021 04:16PM

Photo Stories