అందుకే నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయాం..: సీఎం కేసీఆర్
Sakshi Education
హైదరాబాద్: నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా రాష్ట్రంపై దాదాపు లక్ష కోట్ల రూపాయల భారం పడిందన్నారు.
నిరుద్యోగుల భృతికి సంబంధించి విధివిధానాల రూపకల్పనలో ఉన్నప్పుడు ఈ కరోనా వచ్చిందన్నారు. ఆ సమయంలో కొన్ని నెలల పాటు ఉద్యోగులకు వేతనాలే సరిగా ఇవ్వలేకపోయామన్నారు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదని సీఎం పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుందని.. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని అన్నారు.
Published date : 18 Mar 2021 06:12PM