Skip to main content

అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల గడువు అక్టోబర్ 22 వరకుపొడిగింపు

ఫిలింనగర్ (హైదరాబాద్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబర్ 22 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయ స్టడీ సెంటర్లలో ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు తదితర వివరాల్ని పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఇంటర్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు, వర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016 నుంచి 2019 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. వివరాలకు 7382929570లో సంప్రదించాలని సూచించారు.
Published date : 16 Oct 2020 03:30PM

Photo Stories