అక్కడి నుంచి వచ్చిన ఉద్యోగులకు రూ.30 వేల వేతనం’..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవైన 698 మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు రాష్ట్రంలో ఇంకా పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు వారికి నెలకు రూ.30 వేల తాత్కాలిక జీతం చెల్లించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు.
మార్చి 31న ఏపీ ప్రభుత్వం వారిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఏప్రిల్ 17–19 మధ్యకాలంలో వారు తెలంగాణ రాష్ట్ర ట్రెజరీ కార్యాలయం డైరెక్టర్‌కు జాయినింగ్ రిపోర్టు సమర్పించారు. కోవిడ్–19 వల్ల వారికి ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేకపోయారు. పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేశాక, ఇప్పుడు తీసుకోనున్న తాత్కాలిక జీతాన్ని అసలు జీతాలతో సర్దుబాటు చేయనున్నారు.
Published date : 09 Jun 2021 02:37PM