ఐఐటీహెచ్ విద్యార్థులకు హైసియా అవార్డు
Sakshi Education
సంగారెడ్డి టౌన్: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. పీహెచ్‌డీ విద్యార్థులు తయారు చేసిన ‘స్వచ్ఛ ఎయిర్’స్టార్టప్‌కు హైసియా 28వ వార్షిక టాప్ టెన్‌లో స్థానం దక్కింది.
దీంతో విద్యార్థుల కృషిపై సంస్థ డెరైక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ కోవిడ్-19 సమయంలో రూపొందించిన ఈ స్టార్టప్ సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తమ స్టార్టప్ ద్వారా పర్యావరణానికి, సమాజానికి హాని చేసే కోవిడ్-19 లాంటి వైరస్‌లు వాతావరణంలో ఉన్నప్పుడు గుర్తించడం సులభమవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు చేసే దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
Published date : 12 Nov 2020 05:04PM