Skip to main content

అగ్రి, హార్టికల్చర్ బీఎస్సీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ కోర్సులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోందని రిజిస్ట్రార్ డాక్టర్ త్రిమూర్తులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీ ఎంసెట్-2020లో ర్యాంకు సాధించిన బైపీసీ అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో బీఎస్సీ (హానర్స్) అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-అనిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ-ఏహెచ్), బీఎస్సీ (ఫిషరీస్), బీఎస్సీ (హానర్స్) హార్టికల్చర్, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ) కోర్సులకు రైతుల కోటా కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. www.angrau.ac.in లో ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అన్ని వర్సిటీలకు ఒకే దరఖాస్తు సరిపోతుందన్నారు.
Published date : 23 Nov 2020 02:11PM

Photo Stories