326 దివ్యాంగుల ఉద్యోగాలకు నోటిఫికేషన్..
Sakshi Education
సాక్షి, అమరావతి: దివ్యాంగుల కోసం వివిధ జిల్లాలలో రిజర్వ్ చేసిన 326 ఉద్యోగాల భర్తీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు దివ్యాంగులు, లింగ మార్పిడి, వయోవృద్ధుల శాఖ సంచాలకులు డాక్టర్ కృతికా శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాల కలెక్టర్లు నియామక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా కొన్ని జిల్లాల్లో బుధవారం తరువాత నోటిఫికేషన్ జారీ అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 7, విజయనగరంలో 4, విశాఖపట్నంలో 21, తూర్పు గోదావరిలో 62, పశ్చిమగోదావరిలో 6, కృష్ణాలో 41, గుంటూరులో 31, ప్రకాశంలో 34, నెల్లూరులో 29, చిత్తూరులో 20, వైఎస్సార్ కడపలో 24, కర్నూలులో 24, అనంతపురం జిల్లాలో 23 పోస్టులు ఉన్నాయని, పూర్తి వివరాలతో కలెక్టర్లు నోటిఫికేషన్ ఇచ్చారని డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో 17వ తేదీ తరువాత నోటిఫికేషన్ ఇస్తామని పేర్కొన్నారు.
Published date : 17 Mar 2021 03:12PM