Inter Online Admission 2021: విద్యాదీవెన,ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం..
సెప్టెంబర్ 7వ తేదీన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే జవాబుదారీతనం ఉంటుందన్నారు. యాజమాన్యానికి ఇస్తే పిల్లల చదువుల బాధ్యత ఎవరు తీసుకుంటారని మంత్రి ప్రశ్నించారు. 40 శాతం మంది యాజమాన్యాలకు చెల్లించట్లేదనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
75 శాతం అటెండెన్స్ లేకపోతే..
‘‘కొన్ని కళాశాలల్లో పీఆర్వో వ్యవస్థ విద్యాదీవెన కోసమే అడ్మిషన్లు చేస్తున్నాయి. 75 శాతం అటెండెన్స్ లేకపోతే రెండో విడత రాదు. గతంలో ఇంటర్ అడ్మిషన్లలో రిజర్వేషన్లు పాటించలేదు. పూర్తి పారదర్శకత కోసమే ఆన్‌లైన్ విధానం. డిగ్రీ అడ్మిషన్లలో ఆన్‌లైన్ విధానం విజయవంతమైందని’’ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.