నవంబర్ 29 నుంచి మెడికల్ వెబ్ ఆప్షన్లు: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో వైద్య విద్య సీట్ల భర్తీకి నవంబర్29 నుంచి వెబ్‌ఆప్షన్లను ఆహ్వానించడానికి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది.
తుది మెరిట్ జాబితాను వారం రోజుల కిందటే విడుదల చేసినా.. సాంకేతిక కారణాల వల్ల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా సమస్య పరిష్కారం కావడంతో తిరిగి భర్తీపై దృష్టి పెట్టినట్టుగా యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
Published date : 28 Nov 2020 12:50PM