నేటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాల రిజిస్ట్రేషన్ షురూ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
నీట్ యూజీ –2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు మంగళవారం ఉదయం 8 నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి ను సంప్రదించాలని పేర్కొంది.
Published date : 01 Dec 2020 04:39PM