మళ్లీ పెరగనున్న వైద్య కోర్సుల ఫీజులు?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సహా మెడికల్ పీజీ, ఇతర సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు పెంపునకు సన్నాహాలు మొదలయ్యాయి.
మూడేళ్లకోసారి ఫీజుల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే వైద్య విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుల ఖరారుకు తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ) నోటిఫికేషన్ జారీచేసింది. అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 2020-23 కాలానికి ఫీజు ఖరారుకు సంబంధించి గత మూడేళ్ల తమ ఆడిట్ నివేదికలు సమర్పించాలని కోరింది. ఆడిట్ నివేదికలు, ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించేందుకు చివరి తేదీ ఈ నెల 31వ తేదీ అని తెలిపింది. ఫీజు ప్రతిపాదనలను సమర్పించని లేదా స్పందించని కాలేజీలు 2020-23 కాలానికి సవరించిన ప్రకారం ఫీజు వసూలు చేయడానికి అనుమతి ఉండదని టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ పేర్కొంది. గతేడాది ప్రైవేటు వైద్య కళాశాలలు ద్రవ్యోల్బణం, ఉపాధ్యాయుల జీతాల పెరుగుదలను పేర్కొంటూ ఐదు శాతం ఫీజుల పెంపును 2016లో కోరాయి. కానీ ప్రభుత్వం పెంచలేదు. 2017లో ప్రైవేటు మెడికల్ పీజీ ఫీజులను ఖరారు చేశారు. కాగా, రాష్ట్రంలో 21 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 11 ప్రైవేట్ డెంటల్ కాలేజీలు ఉన్నాయి.
ఐదు శాతం పెంచితే?
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని వైద్య సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటా సీట్లు ఉంటాయి. ఇక 35 శాతం బీ కేటగిరీ సీట్లు ఉంటాయి. మరో 15 శాతం సీట్లను సీ కేటగిరీ కింద భర్తీ చేసుకునే వీలుంది. ఇప్పుడు బీ, సీ కేటగిరీ సీట్లకు ఫీజు పెంచేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ బీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ.11.55 లక్షలుంది. 5 శాతం పెంచితే మొత్తం ఏడాదికి రూ. 12,12,750 కానుంది. సీ కేటగిరీ ఫీజు ఏడాదికి రూ. 23.1 లక్షలుంది. 5 శాతం పెంచితే మొత్తం ఎంబీబీఎస్ సీ కేటగిరీ ఫీజు రూ. 24,25,500 కానుంది.
కన్వీనర్ కోటాలోనూ భారీ పెంపు!
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్ల ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2020-21 వైద్య విద్యా సంవత్సరంలోనే ఈ ఫీజుల భారాన్ని వైద్య విద్యార్థులపై పడేసేలా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఆ మేరకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చట్టం అమలుపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని ఎంసీఐ స్థానంలో ఏర్పడిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను కేంద్రం ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.

Published date : 04 Jan 2020 01:03PM