కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్య సిబ్బంది భర్తీకి తెలంగాణ నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఏడాది పాసైన వాళ్ల నుంచి, రిటైర్ అయినవాళ్ల వరకూ ఎవరైనా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ మూడో తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. స్పెషలిస్ట్ డాక్టర్లకు రూ.లక్ష, మెడికల్ ఆఫీసర్ (ఎంబీబీఎస్)లకు రూ.40 వేలు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లకు రూ.35 వేలు, స్టాఫ్ నర్సులకు రూ.23 వేలు, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17 వేల చొప్పున వేతనం ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న 18 ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 1,645 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పుడు కాంట్రాక్ట్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Published date : 30 Mar 2020 03:29PM