సివిల్స్ మెయిన్స్ జీఎస్-3 ప్రిపరేషన్ ప్లాన్
Sakshi Education
పేపర్-4 (జనరల్ స్టడీస్-3) 250 మార్కులు
ఎకానమీ: తమ్మా కోటిరెడ్డి
సైన్స్ అండ్ టెక్నాలజీ: సి.హరికృష్ణ
సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్: డా.బి.జె.బి. కృపాదానం
సిలబస్:సాంకేతిక పరిజ్ఞానం(టెక్నాలజీ), ఆర్థికాభివృద్ధి, జీవ వైవిధ్యం (బయో డైవర్సిటీ), పర్యావరణం (ఎన్విరాన్‌మెంట్), భద్రత(సెక్యూరిటీ), విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్).

ఎకానమీ-విశ్లేషణ
ఎకానమీ సిలబస్‌లో 10 చాప్టర్లను పేర్కొన్నారు. వీటికి సంబంధించి 125 మార్కుల వరకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది. గత మెయిన్స్ ప్రశ్నపత్రాల్లో జనరల్ స్టడీస్‌కు సంబంధించి సంక్షిప్త, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇచ్చారు. ఈసారి సిలబస్ మారిన నేపథ్యంలో దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. తొలుత సిలబస్‌లో ఇచ్చిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి తర్వాత వర్తమాన పరిస్థితులకు అన్వయించి అధ్యయనం చేయాలి.
సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై విశ్లేషణ..
1. ప్రణాళికలకు సంబంధించి ప్రణాళికా పెట్టుబడిలో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను పరిశీలించాలి. ప్రణాళికలలో వృద్ధికి అనుపాతంగా ఉపాధి వృద్ధిని గమనించాలి. లోటు బడ్జెట్, విదేశీ సహాయం, నిరుద్యోగ భావనలు, 12వ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి.
2. సమ్మిళిత వృద్ధికి సంబంధించిన ముఖ్యాంశాలను అధ్యయనం చేసే క్రమంలో భారత్‌లో సాంఘిక వెనుకబాటుతునం నిర్మూలనలో సమ్మిళిత వృద్ధి పాత్ర, దాని సాధనకు వివిధ రంగాల్లో చేపట్టాల్సిన చర్యలను చదవాలి. ఆహారభద్రత, వ్యవసాయ బడ్జెట్, ఇండియా ఇన్‌క్లూజివ్ ఫండ్ తదితర అంశాలను అధ్యయనం చేయాలి. వీటి గురించి సంక్షిప్త నోట్స్ (short notes) రాసుకోవాలి.

3. బడ్జెటింగ్ అనేది ముఖ్యమైన అంశం. దీన్నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా, ప్రభుత్వ రుణం, లోటు బడ్జెట్, కోశ విధానం, ఫెడరల్ విత్తం వంటి అంశాలను పరిశీలించాలి.
4. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను పరిశీలించే క్రమంలో ఆర్థిక సంఘం పాత్ర, 13వ ఆర్థిక సంఘం సిఫార్సులు, 14వ ఆర్థిక సంఘం పైనా దృష్టి సారించాలి.
5. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన రాబడి, మూలధన వ్యయం, ద్రవ్యలోటు, ప్రాథమిక లోటు, అంతర్గత రుణం, బహిర్గత రుణం తదితర అంశాలకు సంబంధించి సంక్షిప్త నోట్స్ రాసుకోవాలి.
6. వ్యవసాయ రంగానికి సంబంధించి స్వాతంత్య్రానంతరం పంటల తీరులో వచ్చిన మార్పులు, పంటల తీరును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు, వివిధ ఇరిగేషన్ పద్ధతుల ధోరణులను అధ్యయనం చేయాలి. వ్యవసాయ మార్కెటింగ్‌లో ఎదురయ్యే సమస్యలను పరిశీలించాలి. క్రమబద్ధమైన మార్కెట్లు (రెగ్యులేటెడ్ మార్కెట్లు), సహకార మార్కెటింగ్ సొసైటీల పాత్రను పరిశీలించాలి.
7. వ్యవసాయ సమాచార విస్తరణలో మొబైల్ టెక్నాలజీ, ఈ-టెక్నాలజీలో భాగంగా ఇన్‌పుట్ మేనేజ్‌మెంట్, దిగుబడి అంచనా, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్‌ల ప్రాధాన్యతను పరిశీలించాలి.
8. వ్యవసాయరంగానికి లభించే ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీ విధానం, కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రతకు సంబంధించి దీర్ఘ సమాధాన ప్రశ్నలను అధ్యయనం చేయాలి. లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ, పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ, యూనివర్సల్ పీడీఎస్, మద్దతు ధరలను నిర్ణయించడానికి అనుసరించే పద్ధతులు, వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్‌కు సంబంధించిన సంక్షిప్త నోట్స్ ను అధ్యయనం చేయాలి.
9. పారిశ్రామిక రంగంలో భాగంగా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధిని దశలవారీగా పరిశీలించాలి. సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో ఈ అంశాలు ఇమిడి ఉంటాయి. ఉత్పత్తిని మార్కెట్‌కు చేరవేయడం దగ్గర నుంచి వినియోగదారుని ప్రయోజనాల పరిరక్షణ వరకు ఉన్న అంశాలను సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా పరిశీలించాలి.
10. భూ సంస్కరణలలో భాగంగా మధ్యవర్తుల తొలగింపు, కౌలు విధానం, కమతాలపై గరిష్టపరిమితికి సంబంధించి తీసుకొచ్చిన శాసనాలు, వాటి అమల్లో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించాలి. భారత సాంఘిక-ఆర్థికాభివృద్ధిపై భూ సంస్కరణల ప్రభావాన్ని పరిశీలించాలి. దీన్నుంచి ‘జనరల్ ప్రశ్నలు’ వచ్చే అవకాశముంది.
11. 1991 తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు.. భారత ఆర్థి క వ్యవస్థ వృద్ధిపై ఏ మేరకు ప్రభావం చూపించాయో పరిశీలించాలి. పన్నులు, పారిశ్రామిక రంగం, మూలధన మార్కె ట్, బీమా రంగం, అంతర్జాతీయ వాణిజ్యంపై సరళీకృత ఆర్థిక విధానాల ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. 1948, ఆ తర్వాత రూపొందించిన పారిశ్రామిక తీర్మానాలలో మార్పుల నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధిని పరిశీలించాలి.
12. ఇటీవల కాలంలో అవస్థాపనా రంగానికి ప్రాధాన్యం ఏర్పడిన దృష్ట్యా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాని (పీపీపీ)కి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. పీపీపీలో ప్రగతి, అవస్థాపనా ప్రాజెక్టుల నిర్మాణంలో పీపీపీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలి. శక్తి, రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అభివృద్ధిలో భాగంగా పీపీపీ ప్రగతిని పరిశీలించాలి.
13. పెట్టుబడి నమూనాలలో భాగంగా వివిధ ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య నమూనాలను పరిశీలించాలి.
రిఫరెన్స్: Indian Economy: MISHRA & PURI, 30th edition.
Agriculture Economics: Sadhu & Singh.
Public finance: Musgrave & Musgrave.
India Infrastructure Report 2012
Industrial Economics: Cherunilam
Indian Economy: 22nd Edition, Uma Kapila & Raj Kapila.
Economics of Development and Planning: M.L.Jhingan.

సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం
1. సివిల్స్ మెయిన్స్ జీఎస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్‌ను ప్రత్యేకంగా పేర్కొన్నప్పటికీ గత మెయిన్స్ పరీక్షలలోని జీఎస్-2 పేపర్‌లో ఇదే సిలబస్ నుంచి ప్రశ్నలు వచ్చాయి. అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి.
2. ఇంతవరకు యూపీఎస్సీ మోడల్ పేపర్లను విడుదల చేయలేదు కాబట్టి ప్రశ్నల సరళి గత మెయిన్స్ జీఎస్ పేపర్ల తరహాలో ఉండే అవకాశముంది. వివిధ స్థాయిల్లో పదాల పరిమితిని (20, 50, 150, 350 పదాలు) విధించి ప్రశ్నలు అడిగేందుకు అవకాశముంది. కాబట్టి సిలబస్‌లోని అంశాలపై పూర్తిస్థాయిలో ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. ఇందుకోసం అంశాలను బేసిక్స్ నుంచి చదవాలి. ప్రతి అంశం పరిధిని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఎక్కువ మంది అభ్యర్థులు విఫలమవుతున్నారు. ప్రశ్నల స్థాయిని అనుసరించి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి.
3. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అభివృద్ధితో పాటు దైనందిన జీవితంలో దాని అనువర్తనాలు ఏ విధంగా ఉంటున్నాయన్న దానిపై అభ్యర్థులు దృష్టిసారించాలి. ఎలక్ట్రానిక్స్; ఆరోగ్య, వైద్య రంగం; రక్షణ, రోబోటిక్స్, కంప్యూటర్ టెక్నాలజీలోని అభివృద్ధి అంశాలను చదవాలి. సరికొత్త కమ్యూనికేషన్ పరికరాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి.
4. దైనందిన జీవితంలో వాడే వాటర్ ప్యూరిఫయర్స్, ల్యాప్‌టాప్స్, మొబైల్స్, లైట్స్ , డయాగ్నస్టిక్ కిట్స్ వంటి పరికరాలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి.
5. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతీయులు సాధించిన విజయాలకు సంబంధించి అభ్యర్థులు రక్షణ, అంతరిక్షం, ఐటీ, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో దేశం సాధించిన ప్రగతిపై దృష్టిసారించాలి.
6. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేస్తున్న కొత్త టెక్నాలజీపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి. ఐటీ, అంతరిక్షం, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ అంశాలకు సంబంధించిన పరిధిని గుర్తించాలి. ఈ మధ్యకాలంలో రంగాల వారీగా సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవాలి.

ఉదా: అంతరిక్ష రంగంలో ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్ వ్యవస్థ ఉపగ్రహాలు; వాటిని ప్రయోగించే పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ నౌకలు, చంద్రయాన్-1 తదితరాలను మాత్రమే కాకుండా ఇస్రో ప్రయోగించనున్న IRNSS, చంద్రయాన్-2, మార్స్ ఆర్బిటర్ తదితరాలపై దృష్టిసారించాలి. అదే విధంగా అభివృద్ధి చెందుతున్న జీఎస్‌ఎల్‌వీ-మార్క్ 3, ఆస్ట్రోశాట్‌ల గురించి చదవాలి. ఇటీవలి కాలంలో చేపట్టిన ప్రయోగాలు, వైఫల్యాల గురించి తెలుసుకోవాలి.
7. మేధో సంపత్తి హక్కులు, వాటి రకాలు, భారత్‌లో పరిస్థితులు, వివాదాలు, ఇటీవలి కాలంలో సాధించిన పేటెంట్‌లు తదితర అంశాలను అభ్యర్థులు అర్థం చేసుకోవాలి.
8. మానవ అభివృద్ధి కారణంగా పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడింది. మనిషి ఉనికి ప్రశ్నార్థకమైంది. ఈ నేపథ్యంలో పర్యావరణ కాలుష్యం (గాలి, నీరు, నేల, కాంతి) గురించి చదవాలి. శీతోష్ణస్థితిలో మార్పులకు కారణాలు-ప్రభావాలు, నష్టాలు, పరిష్కారాలు, అంతర్జాతీయ, జాతీయస్థాయి చర్యలపై దృష్టిసారించాలి.
9. జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలు, తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలను తెలుసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయస్థాయి చర్యలు, ఒప్పందాలు, పర్యవసానాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. భారత్‌లో అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం పర్యావరణంపై ఏ విధంగా ఉంది? పర్యావరణ ప్రభావంపై అంచనాలో లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను చదవాలి.
10. బేసిక్స్ ఫై పట్టు, సిలబస్‌లోని అంశాలపై విస్తృత పరిధిని తెలుసుకోవడం, రైటింగ్ ప్రాక్టీస్‌తో మాత్రమే అధిక మార్కులు సాధించడానికి వీలవుతుంది.
రిఫరెన్స్: Science Reporter, Discovery, Hindu environmental survey, India year book.
భద్రత, విపత్తు నిర్వహణ
విపత్తు, విపత్తు నిర్వహణ
1. విపత్తు అంటే ఏమిటి? అదెలా సంభవిస్తుంది? విపత్తులో రకాలు: సహజసిద్ధమైన, మానవ చర్యల వల్ల సంభవించే విపత్తులు. వీటిని ఎలా నివారించవచ్చు? నివారణ వీలుకానప్పుడు వాటి ప్రభావాన్ని ఏమేరకు తగ్గించవచ్చు? తదితర అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి.
2. సహజసిద్ధ విపత్తులలో ముఖ్యమైన సునామి, వరదలు, తుపానులు, భూకంపాలు, కరువు మొదలైనవి సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవాలి.
3. సీబీఎస్‌ఈ.. 9, 10, 11 తరగతుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చింది. అందువల్ల అభ్యర్థులు ఈ పుస్తకాలను చదవాలి.
4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తుల నివారణకు, ఒకవేళ విపత్తులు సంభవిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి (జాతీయ), ముఖ్యమంత్రి (రాష్ట్ర), కలెక్టర్ (జిల్లా) అధ్యక్షతన ఏర్పాటు చేసిన యంత్రాంగాలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి.

అభివృద్ధికి, తీవ్రవాదానికి గల సంబంధం:
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశాయి. దురదృష్టవశాత్తు వీటి ఫలాలు అర్హులైన వారికి అందలేదు. దళితులు, ఆదివాసులు, మహిళల జీవితం మరింత దుర్భరమైంది. ఈ నేపథ్యంలో నక్సలిజం ఆవిర్భవించింది. దీన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించే క్రమంలో బలహీనవర్గాలు సమిధలవుతున్నాయి. తీవ్రవాదం వ్యాప్తికి కారణమవుతున్న అంశాలు, దాని నివారణకు సంబంధించిన అంశాలను ఈ యూనిట్‌లో అధ్యయనం చేయాలి.
రిఫరెన్స్: Development Challenges in Extremist Affected Areas, Planning commission report.
దేశ ఆంతరంగిక భద్రతకు ఇతర రాజ్యాలు, రాజ్యాంగేతర శక్తులు విసురుతున్న సవాళ్లు:
ఒకవైపు చైనా, పాకిస్థాన్, కొంతమేరకు బంగ్లాదేశ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ భద్రతకు విఘాతం కలిగిస్తుంటే, మరోవైపు మతఛాందసత్వం, తీవ్రవాదం (మావోయిజం), ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటు వాదం దేశ ఆంతరంగిక భద్రతకు పెను సవాళ్లుగా మారాయి. భద్రతకు ముప్పు తెస్తున్న అవినీతి, కుల, మత, ప్రాంతీయ తత్వాలు, పేదరికం, బలహీనవర్గాల అణచివేత తదితరాలను కూడా అభ్యర్థులు విశ్లేషించాలి.
రిఫరెన్స్: India's Security challenges at home and abroad, C.Raja Mohan and Ajai Sahni 2012.
ఆంతరంగిక భద్రతకు సవాళ్లు:
1. సమాచార వ్యవస్థలు, మీడియా పాత్ర, సామాజిక నెట్వర్క్స్- ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితరాలు. అంతర్జాలం (ఇంటర్నెట్) రెండంచుల కత్తి లాంటిది. ఇది ఒకవైపు తీవ్రవాద చర్యల్ని పసిగట్టడానికి, సుపరిపాలన అందించడానికి తోడ్పడుతుంటే మరోవైపు దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం శత్రుదేశాలకు, తీవ్రవాదులకు చేరే ప్రమాదముంది. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఆయా సంఘటనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ కొన్నిసార్లు భద్రతా దళాల నివారణ చర్యలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దేశ భద్రతకు విసురుతున్న సవాళ్లపై అభ్యర్థులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి.

రిఫరెన్స్: Indian Administration, Fadia & Fadia. 2. India's internal security challenges, Ved Marwah.
2. అక్రమంగా డబ్బు తరలింపు నివారణ- ఇటీవల పార్లమెంటు అంతకుముందు అమల్లో ఉన్న చట్టాన్ని (2002) సవరిస్తూ విదేశాలలో అమలవుతున్న చట్టాలకు అనుబంధంగా మార్పులు తెచ్చింది. ఈ చట్టం.. అక్రమంగా తరలించిన డబ్బును ఉగ్రవాద చర్యలకు ఉపయోగించకుండా నివారించేందుకు ఉద్దేశించింది. అభ్యర్థులు నల్లధనం ఉగ్రవాదానికి ఎలా దోహదం చేస్తుంది? దాని నివారణ మార్గాలు ఏమిటి? తదితరాలపై దృష్టిసారించాలి.
సరిహద్దుల్లో ఉత్పన్నమయ్యే భద్రతా సవాళ్లు, వాటి నిర్వహణ; ఉగ్రవాదానికి వ్యవస్థీకృత నేరాలతో గల సంబంధం:
రోజూ వేలాది మంది పాకిస్థాన్ నుంచి పంజాబ్, కాశ్మీర్ భూభాగంలోకి; బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాల్లోకి చొరబడుతున్నారు. అక్రమంగా ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నిషేధించిన వస్తువుల తరలింపు జరుగుతోంది. ఈ వనరులతో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు.
రిఫరెన్స్:Indian foreign policy and contemporary security challenges, Mukherjee and Malone.
వివిధ భద్రతా దళాలు, వాటి బాధ్యతలు:
1. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ), అస్సాం రైఫిల్స్ కాంబాట్ బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్).
2. ఈ దళాలు విపత్తు నిర్వహణ, సరిహద్దుల గస్తీ, ఉగ్రవాద చర్యల నివారణ, రాజకీయ ప్రముఖులకు భద్రత, అవసరమైనప్పుడు శాంతిభద్రతల నిర్వహణ తదితర విధులు నిర్వర్తిస్తున్నాయి. వీటి వ్యవస్థీకరణ, పనితీరుపై అభ్యర్థులు సరైన అవగాహనను పెంపొందించుకోవాలి.
Published date : 20 Jun 2013 07:51PM