Skip to main content

సివిల్స్ మెయిన్స్ చరిత్ర.. విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం

సివిల్స్ ఔత్సాహికులు ప్రిలిమ్స్‌ను, మెయిన్స్‌ను విడివిడిగా చూడకూడదు. ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నప్పుడే చరిత్ర పాఠ్యాంశాలను మెయిన్స్ కోణంలోనూ అధ్యయనం చేయాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ చదివితేనే విజయం సొంతమవుతుంది.

చరిత్ర..
యూపీఎస్సీ సిలబస్‌లో జనరల్ స్టడీస్ మొదటి పేపర్‌లో భారతదేశ చరిత్రతో పాటు ప్రపంచ చరిత్రను కూడా చేర్చారు. మొత్తం చరిత్ర సిలబస్‌ను పరిశీలిస్తే మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. అవి..

భారతీయ సంస్కృతి
ఇందులో ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలం వరకున్న సాంస్కృతికపరమైన కళలు, సాహిత్యం, నిర్మాణ రంగాలను చేర్చారు. వివిధ కాలాల్లో రాజకీయ చరిత్రను తెలుసుకుంటూ వీటికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలి.

కళలు, సంస్కృతికు సంబంధించి గతంలో సివిల్స్‌లో వచ్చిన ప్రశ్నలు:
Point out the chief characterestics of the architecture of any two of the following?
a) Temples of Khajuraho
b) Taj Mahal
c) Victoria Memorial

నాట్యం, సంగీతం, నాటకం- గత ప్రశ్నలు:

Which are the classical dances of India? Where did they originate? Name on distinguished dancer (Who is living) of each school of classical dance. Are the efforts adequate for promotion such dances in India? If not, what further measures would you suggest for the promotion of classical dances.
In which regions of India did the following dances originates?
1) Bhangra
2) Garba
3) Mohini Attam
4) Kathak
5) Bamboo dance

ఉత్సవాలు, పండగలు- గత ప్రశ్నలు:
In which state/states of India are the following festivals celebrated by a large number of people?
a) Baisakhi
b) Rath yatra
c) Bihu
d) Pongal
e) Onam

సంస్కృతిపై ప్రభావం చూపిన సంస్థలు-గత ప్రశ్నలు:
Why was the National Cadet Corps (NCC) was established in 1948? How is the corps organised and who are eligible to join it? who are responsible for running the organisation?
Explain briefly the importance of the following?
a) INA
b) Asiatic
c) Indian Council of cultural relations

భారతీయ సమాజం, సంస్కృతిపై ప్రభావం చూపిన వ్యక్తులు- గత ప్రశ్నలు:
Describe briefly the impact of the following on India?

a) Leo Tolstoy
b) Kemal Ataturic
c) Karl Marx

ఆధునిక భారతదేశ చరిత్ర
భారతీయ సంస్కృతితో పోల్చితే ఆధునిక భారతదేశ చరిత్ర అంశాలను చదివి, గుర్తుంచుకోవడం చాలా తేలిక. దీనికి సంబంధించి మెయిన్స్ సిలబస్‌లో మూడు ప్రధాన భాగాలున్నాయి. అవి.. ఎ) స్వాతంత్య్ర పోరాటానికి ముందు, బి) స్వాతంత్య్ర పోరాటం, సి) స్వాతంత్య్ర పోరాటం తర్వాత. గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే ఆధునిక భారతదేశ చరిత్రపై ఎలా పట్టు సాధించాలనే దానిపై అవగాహన వస్తుంది.

గత ప్రశ్నలు:
What were the motives which led to the partition of Bengal? What were its consequences? Why was it annulled?

When was the system of Open Competitive Examination in the Indian Civil Service introduced. Analyse the growth of Indian Civil Service till the passing of the Government of India Act, 1919.

18వ శతాబ్దం నుంచి ప్రపంచ చరిత్ర
ఆధునిక భారతదేశ చరిత్రను అవగాహన చేసుకోవాలంటే ఆధునిక ప్రపంచ చరిత్రపై పట్టు సాధించడం అవసరం.

2013లో వచ్చిన ప్రశ్నలు:
'Late comer' Industrial Revolution in Japan involved certain factors that were markedly different from what west had experienced. (Analyze)
'American Revolution was an economic revolt against mercantilism' substantiate.
What policy instruments were deployed to contain the great Economic Depression?
డా॥పి.వి.లక్ష్మయ్య, డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్,హైదరాబాద్.
Published date : 04 Jun 2020 06:50PM

Photo Stories