సిలబస్, సమకాలీన అంశాల సమన్వయంతో..
Sakshi Education
సివిల్స్ మెయిన్స్ పరీక్షలు డిసెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. పోటీ లక్షల నుంచి వేలకు చేరింది. ఇక్కడి నుంచి పకడ్బందీ వ్యూహాలు.. పక్కా ప్రిపరేషన్ ప్లాన్ సాగిస్తేనే చివరి దశ ఇంటర్వ్యూకు అర్హత సాధించడం సాధ్యం.. ఈ నేపథ్యంలో పేపర్-4 (జనరల్ స్టడీస్-3)లో భాగంగా ఉన్న ఎకానమీలో మెరుగైన మార్కులు సాధించేందుకు ఎటువంటి ప్రణాళికలు అనుసరించాలి.. దృష్టి సారించాల్సిన అంశాలు.. వాటిని ఏ విధంగా ప్రిపేర్ కావాలి తదితర అంశాలపై ఫోకస్..
సివిల్స్ మెయిన్స్ పేపర్-4 (జనరల్ స్టడీస్-3) సిలబస్‌లో టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి, బయోడైవర్సిటీ, పర్యావరణం, రక్షణ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(Technology, Economic Development, Biodiversity, Environment, Security and Disaster Management) అంశాలను పొందుపరిచారు. ఈ పేపర్‌కు మొత్తం 250 మార్కులు కేటాయించారు. ప్రశ్నల సరళిని పరిశీలిస్తే.. దీర్ఘ, మధ్య, స్వల్ప తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘ ప్రశ్నలను 15 మార్కులకు, మధ్యతరహా ప్రశ్నలను 8 మారులకు, స్వల్ప ప్రశ్నలను 5 మార్కులకు అడగొచ్చు.
నిర్ణాయక అంశాలు:
భారత ఆర్థిక వ్యవస్థ-ప్రణాళిక, వనరుల సమీకరణ, వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉపాధి అనే అంశాలను ఒక చాప్టర్‌గా పొందుపరిచారు. ఈ అంశాలను అధ్యయనం చేసే క్రమంలో మొదటిగా ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలను పరిశీలించాలి. ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా అమలు చేసిన పంచవర్ష ప్రణాళికలు లక్ష్యాల సాధనలో ఏమేరకు విజయం సాధించాయో తెలుసుకోవాలి. ఈ అంశం నుంచి ప్రభుత్వ రంగ పెట్టుబడికి ఆధారాలు-వాటి ధోరణులు, 11వ ప్రణాళిక సమీక్ష, ప్రణాళికా యుగంలో వనరుల పంపిణీని విమర్శనాత్మకంగా పరిశీలించడం వంటి వాటిపై దీర్ఘ తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రణాళికా వికేంద్రీకరణ, నిరంత ప్రణాళిక, 12వ ప్రణాళిక లక్ష్యాలు, ఆర్థికాభివృద్ధి, ఉపాధి రహిత వృద్ధి, ధీర్ఘకాలిక ప్రణాళిక, ప్రణాళికల పరంగా అవలంబించిన వ్మూహాలు, తదితరాల నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు రావచ్చు.
చర్చనీయాంశం సమ్మిళితవృద్ధి:
ఇటీవలి కాలంలో సమ్మిళిత వృద్ధి చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న వృద్ధి.. ఉపాధి రహిత వృద్ధిగా నిలిచింది. సమ్మిళిత వృద్ధిలో భాగంగా అనుసరించిన ట్రికిల్ డౌన్ (Trickle Down) వ్యూహం ఆచరణలో వైఫల్యం చెందింది. సమ్మిళిత వృద్ధిపై దీర్ఘ తరహా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సాంఘిక రంగం, మానవాభివృద్ధికి సంబంధించిన అంశాలపై నోట్స్ రూపొందించుకోవాలి. ప్రపంచీకరణ కాలంలో అవలంభించిన విధానాలు, సమ్మిళిత వృద్ధి సాధనకు అవరోధంగా నిలిచాయి. దీనికనుగుణంగా పేదరికం, నిరుద్యోగంపై ప్రపంచీకరణ ప్రభావాన్ని అధ్యయనం చేయాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను పరిశీలించాలి. సమ్మిళిత వృద్ధి సాధనలో భాగంగా మానవాభివృద్ధి కీలకమైన అంశం. కాబట్టి ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
అవగాహనతో బడ్జెటింగ్:
గవర్నమెంట్ బడ్జెటింగ్‌లో భాగంగా ప్రభుత్వ రాబడి, వ్యయధోరణులను పరిశీలించాలి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడి ధోరణులు, ప్రభుత్వ వ్యయ వర్గీకరణ పట్ల అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ వ్యయ వర్గీకరణను క్రమ బద్దీకరించే క్రమంలో ఇటీవలి కాలంలోని ఫిస్కల్ కన్సాలిడేషన్ (Fiscal Consolidation)కు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ అంశం నుంచి ప్రధాన (దీర్ఘ) ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తదనుగుణంగా నోట్స్ రూపొందించుకోవాలి. దీంతోపాటు వస్తు, సేవలపై పన్ను, సరళీకరణ విధానాల కాలంలో పన్ను సంస్కరణలు, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోశ విధాన పాత్ర అనే అంశాల నుంచి కూడా ప్రశ్నలు రావచ్చు. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, మూలధన రాబడి-వ్యయం, ప్రణాళిక-ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు వంటి అంశాలు కూడా కీలకమైనవి. వీటి నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
కీలకం ఉత్పాదితాలు:
పంటల తీరు, నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా- మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ అంశాలతో కూడిన చాప్టర్‌లో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన ఉత్పాదితా (Inputs)లను పొందుపరిచారు. ఈ విభాగంలో పంటల తీరు నిర్ణయించే అంశాలు-పంటల తీరును మెరుగుపరచడానికి చర్యలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో సహకార మార్కెటింగ్ పాత్ర, వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఈ-టెక్నాలజీ పాత్ర అనే అంశాలను విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. వీటి నుంచి పెద్ద తరహా ప్రశ్నలు రావచ్చు. క్రమబద్ధమైన మార్కెట్లు, చిన్న నీటిపారుదల, డ్రిప్ ఇరిగేషన్, వ్యవసాయ ఉత్పత్తుల స్టోరేజ్ సౌకర్యాలు వంటి అంశాలకు కూడా తగినంత ప్రాధాన్యతనివ్వాలి. వీటి నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలను అడగొచ్చు.
ప్రధానంగా ప్రజా పంపిణీ:
ప్రత్యక్ష-పరోక్ష వ్యవసాయ సబ్సిడీలు, మద్దతు ధరలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహార భద్రత, బఫర్ స్టాక్, టెక్నాలజీ మిషన్ వంటి అంశాలను ఒక చాప్టర్‌గా పొందుపరిచారు. ఇందులో ప్రజా పంపిణీ వ్యవస్థ, మద్ధతు ధరలు, ఆహార భద్రతపై ప్రశ్నలు అడిగే అవ కాశం ఉంది. మద్దతు ధరల ధోరణి-సమగ్ర మద్దతు ధరల విధానం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఆహార భద్రత సాధించే క్రమంలో.. ఆహార భద్రతా బిల్లు అమలు కోసం చేపట్టాల్సిన చర్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజా పంపిణీ వ్యవస్థ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో నగదు బదిలీ ఎంత వరకు ప్రత్యామ్నాయం కాగలదు? వంటి అంశాల నుంచి దీర్ఘ తరహా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వ్యవసాయ సబ్సిడీలు, లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ, పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయ వ్యయాలు- ధరల కమిషన్, ఆహార భద్రతకు చర్యలు, ఆహార నిల్వలకు సంబంధించిన గణాంకాలు వంటి అంశాలపై కూడా దృష్టి సారించాలి. ఈ అంశాలపై మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది.
ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యత:
చిన్న తరహా పరిశ్రమలు, ఫ్యాక్టరీలు అంశంలో ఫుడ్ ప్రాసెసింగ్ (Food Processing) పరిశ్రమలు అధిక ప్రాధాన్యత పొందాయి. ఈ అంశానికి సంబంధించి భారత్ వంటి ఆర్థిక వ్యవస్థలో ఆయా పరిశ్రమల ప్రాధాన్యత-ప్రగతి, అవి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించాలి. డౌన్ స్ట్రీమ్ (Down Stream), అప్ స్ట్రీమ్ (Up Stream) రిక్వైర్‌మెంట్స్‌లో భాగంగా సాంకేతిక విజ్ఞానం, ఉత్పాదితాలు, కోల్డ్ స్టోరేజ్, పంపిణీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
తప్పకుండా:
భూసంస్కరణలు అంశం నుంచి తప్పకుండా ప్రశ్న రావచ్చు. స్వాతంత్య్రానంతరం భూసంస్కరణల అమలు తీరుపై నోట్స్ రూపొందించుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో భూసంస్కరణలపై ప్రభావం అనే అంశానికి సంబంధించి ప్రామాణిక పుస్తకాలు-జర్నల్స్ నుంచి సమాచారాన్ని సేకరించాలి. భూసంస్కరణల అమల్లో ఎదురవుతున్న సమస్యలను పరిశీలించాలి. రైత్వారీ విధానం, భూ రికార్డులు, మహల్వారీ విధానం, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, కౌలు సంస్కరణలు అనే అంశాల నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
సరళీకరణ విధానాలు:
ఆర్థిక వ్యవస్థపై సరళీకరణ విధానాల ప్రభావం, పారిశ్రామిక విధానంలో మార్పులు, పారిశ్రామికాభివృద్ధిపై పారిశ్రామిక విధానాల ప్రభావం అనే అంశాలను ఒక చాప్టర్‌గా పొందుపరిచారు. సంస్కరణల కాలంలో ప్రభుత్వ రంగ పాత్ర, భవిష్యత్‌లో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం, పారిశ్రామికాభివృద్ధిపై సరళీకరణ విధానాల ప్రభావం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు-పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలు కీలకమైనవి. వీటిని విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావాలి. ఈ అంశాల నుంచి దీర్ఘ తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యే ఆర్థిక మండళ్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competitive Commission of India), లెసైన్సింగ్ విధానం, ప్రైవేటీకరణ విధానంలోని లోపాలు, ప్రైవేటీకరణతో సమస్యలు వంటి అంశాలకు కూడా తగినంత ప్రాధాన్యత నివ్వాలి. వీటి నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలను అడగొచ్చు.
అవస్థాపనా సౌకర్యాలు-ఆర్థికాభివృద్ధి:
అవస్థాపనా సౌకర్యాలకు, ఆర్థికాభివృద్ధికి దగ్గరి సంబంధం ఉంది. అవస్థాపనా సౌకర్యాల్లో భాగంగా శక్తి, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్లు అనే అంశాలను సిలబస్‌లో పొందుపరిచారు. ఇందులో అవస్థాపనా సౌకర్యాలు-ఆర్థికాభివృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో ఎదురవుతున్న సమస్యలు, శక్తి సంక్షోభానికి కారణాలు-సమగ్ర శక్తి విధానం వంటివి కీలకాంశాలు. వీటి నుంచి దీర్ఘ తరహా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి, అణు శక్తి, జల విద్యుత్, పౌర విమానయాన రంగం ఎదుర్కోంటున్న సమస్యలు, ఇటీవలి కాలంలో రోడ్ సెక్టర్ ప్రాజెక్ట్ ప్రగతి వంటి అంశాల నుంచి మధ్య-స్వల్ప తరహా ప్రశ్నలు అడగొచ్చు.
పీపీపీ అవశ్యకత:
పెట్టుబడి నమూనా అంశంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగ స్వామ్యం కీలకాంశం. వివిధ రంగాల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగ స్వామ్యం (Public Private Participation - PPP) ఆవశ్యకత, ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలి. భారీ, మధ్య తరహా ప్రాజెక్ట్‌లు, పబ్లిక్ వర్క్స్‌కు సంబంధించి వివిధ పీపీపీ నమూనాలు అమల్లో ఉన్నాయి. ఆయా అంశాలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించాలి.
రిఫరెన్స్ బుక్స్:
పేపర్-4 (జనరల్ స్టడీస్-3)లోని ఎకానమీకి సంబంధించిన సిలబస్‌ను చాప్టర్ల వారీగా పొందుపరిచారు. వీటిని అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమిక భావనల (కాన్సెప్ట్స్) నుంచి ప్రారంభించాలి. దాంతోపాటు ఎకానమీలో విస్తృతంగా ఉపయోగించే వివిధ పదాల పట్ల అవగాహన కూడా పెంచుకోవాలి. ఎందుకంటే ఎకానమీ అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాన్సెప్ట్స్‌పై పట్టు, పదాలపై అవగాహనతోనే ఈ తరహా ప్రిపరేషన్ సాధ్యమవుతుంది.
ప్రిపరేషన్‌లో గమనించాల్సిన మరో అంశం.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సిలబస్‌లోని వివిధ అంశాలతో అన్వయిస్తూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, రుపాయి విలువ క్షీణత వంటి అంశాలకు సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని నోట్స్ రూపొందించుకోవాలి. ప్రభుత్వ విధానంలో భాగంగా వస్తు, సేవలపై పన్ను, ఆహార భద్రతా బిల్లు, భూసేకరణ బిల్లు వంటి కీలక అంశాల పట్ల విస్తృత స్థాయిలో అవగాహన పెంచుకోవాలి.

- Human Development Index Report 2013 UNDP
- India Infrastructure Report &Oxford university press
- World Development Report
- Economic Survey 2012-13
- Fundamentals of Agricultural Economics& Sadhu & Singh
- Indian Economy& Misra & Puri
- Selected Essays on Indian Economy &C.Rangarajan
పేపర్-4 (జనరల్ స్టడీస్-3)లోని ఎకానమీకి సంబంధించిన సిలబస్‌ను చాప్టర్ల వారీగా పొందుపరిచారు. వీటిని అధ్యయనం చేసేటప్పుడు ప్రాథమిక భావనల (కాన్సెప్ట్స్) నుంచి ప్రారంభించాలి. దాంతోపాటు ఎకానమీలో విస్తృతంగా ఉపయోగించే వివిధ పదాల పట్ల అవగాహన కూడా పెంచుకోవాలి. ఎందుకంటే ఎకానమీ అంశాలను విశ్లేషణాత్మకంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాన్సెప్ట్స్‌పై పట్టు, పదాలపై అవగాహనతోనే ఈ తరహా ప్రిపరేషన్ సాధ్యమవుతుంది.
- ముఖ్యంగా సైన్స్ నేపథ్యంగా ఉన్న అభ్యర్థులు ఈ అంశాన్ని గమనించాలి. ఇందుకోసం ఎన్‌సీఈఆర్‌టీ (+1, +2 తరగతులు) పుస్తకాల ద్వారా వివిధ పద కోశాలైన.. ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయం,వ్యష్టి-వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం వంటి ప్రాథమిక అంశాలు-వాటి నిర్వచనాలను తెలుసుకోవాలి.
- మానవాభివృద్ధి, జనాభా స్థితి గతులు, వివిధ ప్రభుత్వ విధానాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంఘం, కేంద్ర బ్యాంకు విధులు, సుస్థిర వృద్ధి, సమ్మిళిత వృద్ధి, ప్రత్యక్ష-పరోక్ష పన్నులు, కరెంట్ అకౌంట్ లోటు, వాణిజ్య లోటు, ఉపాధి పథకాలు, ప్రణాళికల లక్ష్యాలు, బడ్జెటరీ ప్రక్రియలో వినియోగించే పదాలపై కనీస పరిజ్ఞానం పెంచుకోవాలి.
ప్రిపరేషన్‌లో గమనించాల్సిన మరో అంశం.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సిలబస్‌లోని వివిధ అంశాలతో అన్వయిస్తూ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు, రుపాయి విలువ క్షీణత వంటి అంశాలకు సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని నోట్స్ రూపొందించుకోవాలి. ప్రభుత్వ విధానంలో భాగంగా వస్తు, సేవలపై పన్ను, ఆహార భద్రతా బిల్లు, భూసేకరణ బిల్లు వంటి కీలక అంశాల పట్ల విస్తృత స్థాయిలో అవగాహన పెంచుకోవాలి.
Published date : 14 Nov 2013 04:15PM