Skip to main content

పరిధిని తెలుసుకుంటూ.. పక్కా ప్రిపరేషన్

సివిల్స్ అంకంలో కీలకమైన.. మెయిన్స్. ఈ మెయిన్స్‌లో కీలకమైన పేపర్-4 లోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో మెరుగైన మార్కుల సాధనకు ఏవిధంగా సిద్ధం కావాలి.. ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి.. సమాధానాలను ఎలా ప్రెజెంట్ చేయాలి తదితర అంశాలపై విలువైన సూచనలు..

సైన్‌‌స అండ్ టెక్నాలజీ, పర్యావరణం, విపత్తు నిర్వహణ సంబంధిత అంశాల ప్రస్తావన జనరల్ స్టడీస్-3(పేపర్-4) లో ఉంది. ఈ అంశాలకు సంబంధించి కనీసం 70 నుంచి 80 మార్కులకు తక్కువ కాకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తొలుత సిలబస్‌లో ఉన్న అంశాలను క్షుణ్నంగా అవగాహన చేసుకోవడంతో పాటు ఆయా అంశాల పరిధిని తెలుసుకోవడం కూడా ప్రిపరేషన్‌లో కీలకమనే విషయాన్ని గమనించాలి.

ప్రస్తుత నూతన విధానంలో మాత్రం సిలబస్‌ను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇక్కడ మరో విషయం.. గతంలో అడిగిన ప్రశ్నలు.. ప్రస్తుతం పేర్కొన్న సిలబస్ ఆధారంగా ఉండడాన్ని గమనించవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని గత ప్రశ్నపత్రాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిపై కూడా దృష్టి సారించడం ఉపయోగకరం. వాటిల్లో ప్రశ్నలు అడిగిన తీరును, వచ్చిన అంశాలను గమనిస్తూ ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరం.

సిలబస్‌ను విశ్లేషిస్తే:
సైన్‌‌స అండ్ టెక్నాలజీ అభివృద్ధి, దైనందిన జీవితంలో వీటి అనువర్తనాలు, ప్రభావాలు (Science and Technology developments and their applications and effects in everyday life) అని పేర్కొనడం జరిగింది. ఇదివరకు కూడా ఈ అంశంపై అనేక ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అన్ని విభాగాలలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం.. సైన్‌‌స అండ్ టెక్నాలజీ. మానవ జీవితంలో ఎన్నో ప్రగతిశీల మార్పులను తీసుకురావడంలో ఈ రంగం గణనీయమైన పాత్రను పోషిస్తుంది.

ఉదాహరణకు రివర్‌‌స ఆస్మాసిస్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం రివర్‌‌స ఆస్మాసిస్ పరిజ్ఞానాన్ని వినియోగించడం అధికమైంది. గత మెయిన్‌‌సలోను ఈ అంశంపై ప్రశ్నలు అడిగారు. అదేవిధంగా అభ్యర్థులు టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్, టీకాలు, రిమోట్ సెన్సింగ్, ఇంటర్నెట్, సౌర టెక్నాలజీ, వైద్య విధానాలు, పరికరాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా మానవ జీవితంలో వస్తున్న మార్పులపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు ఇంటర్నెట్ మెడిసిన్ అంటే ఏమిటి? దీని లాభనష్టాలు? పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ సూత్రాన్ని తెలపండి? హైడెఫినిషన్ టెలివిజన్ టెక్నాలజీ గురించి కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

భారతీయుల పాత్ర కీలకం:
మరో అంశం.. సైన్‌‌స అండ్ టెక్నాలజీలో భారతీయులు సాధించిన విజయాలు, దేశీయ టెక్నాలజీ -కొత్త టెక్నాలజీ అభివృద్ధి (Achievements of Indians in science & technology; indigenization of technology and developing new technology). ప్రాచీన కాలం నుంచే భారతదేశం సైన్‌‌స అండ్ టెక్నాలజీ రంగంలో విశేషమైన ప్రగతిని సాధించింది. వైద్య శాస్త్రం, ఖగోళశాస్త్రం, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, నిర్మాణ రంగాల్లో అత్యున్నత ప్రగతిని ప్రాచీన కాలంలోనే నమోదు చేసుకుంది. ఆర్యభట్ట, భాస్కర, వరాహమిహిర, సుశ్రత, చరక, పతంజలి, కణార, నాగార్జున వంటి వారి కృషి కారణంగా మన దేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ విషయంలో విశేషమైన కృషి చేశారు. వారిలో సత్యేంద్రనాథ్ బోస్, సర్ సి.వి.రామన్, శ్రీనివాస రామానుజన్, శాంతి స్వరూపభట్నాగర్, హోమీ జహీంగీర్ బాబా, విక్రమ్ సారాభాయి, హరగోవింద్ ఖురానా, జీఎన్ రామచంద్రన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, హారిష్‌చంద్ర, ఏపీజే అబ్దుల్‌కలామ్, అనిల్ కకోద్కర్, వెంకట్ రామకృష్ణన్ కొందరు.

ఈ నేపథ్యంలో వీరందరూ సైన్‌‌స అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధికి చేసిన కృషిని తెలుసుకోవడంతోపాటు.. ఈ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని అవగాహన చేసుకోవాలి. స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అనుసరిస్తున్న సైన్స్ విధానం మొదలైన అంశాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

విశ్లేషణాత్మకంగా:
మరో విభాగంలో అంతరిక్షం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్‌‌స, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి అంశాలపై అవగాహనతోపాటు మేథోసంపత్తి హక్కులకు సంబంధించిన విషయాలు (Awareness in the fields of IT, Space, Computers, robotics, nanotechnology, biotechnology and issues relating to intellectual property rights) ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న అభివృద్ధి అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు చదువుకోవాలి. ఉదాహరణకు అంతర్జాతీయ స్థాయిలో నాసా చేపట్టిన కార్యక్రమాలు.. మార్‌‌సరోవర్, వాయేజర్ వంటి వాటి గురించి క్షుణ్నంగా అవగాహన పెంచుకోవాలి. అదే సమయంలో భారత అంతరిక్ష కార్యక్రమంపై కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా ఇన్‌శాట్, రిశాట్ ఉపగ్రహ వ్యవస్థల అనువర్తనాలు, టెలి-మెడిసిన్, టెలి-ఎడ్యుకేషన్‌తోపాటు ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల (సరళ్, రీశాట్-1, మేఘట్రాపిక్ తదితరాలు)పై ప్రధానంగా దృష్టి సారించడం ప్రయోజనకరం. కొన్ని విశ్లేషణాత్మక ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఉదాహరణకు- భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్‌ఎల్‌వీ ప్రాధాన్యత ఏంటి? అదే విధంగా డీఏ స్పేస్ నెట్‌వర్‌‌క, చంద్రయాన్, జీఎస్‌ఎల్‌వీ-మార్‌‌క -3, దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ వంటి అంశాలపై విశ్లేషణాత్మక ప్రశ్నలు అడగొచ్చు. భారత అంతరిక్ష కార్యక్రమం బలాలు, బలహీనతలు ఏంటి? అనే ప్రశ్నలు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఉప అంశాలపై కూడా:
మరో కీలక అంశం.. బయోటెక్నాలజీ. గత కొన్నేళ్లుగా ఈ రంగం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో బయోటెక్నాలజీ రంగంలో పలు సమకాలీన అంశాలు వృద్ధిలోకి వచ్చాయి. వాటిల్లో మూలకణాలు, జన్యు మార్పిడి మొక్కలు, జంతువులు, డీఎన్‌ఏ, ఫింగర్ ప్రింటింగ్, జన్యు ఇంజనీరింగ్, రీకాంబినెంట్ డీఎన్‌ఎ టెక్నాలజీ, కాలుష్య నిర్మూలనకు జీవ సాంకేతిక విజ్ఞానం, జన్యు పట ఆవిష్కరణ, వ్యక్తిగత జన్యు పటాలు, జీనోమిక్ లైబ్రరీస్, బయోఇన్ఫర్మాటిక్స్ మొదలైనవి. ఈ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ఏదైనా ఒక అంశాన్ని నిర్దేశించుకుని చదివేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. ఆ అంశాన్ని సమూలంగా అధ్యయనం చేయడంతోపాటు అందులోని ఉప విభాగాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఉదాహరణకు- మూలకణాలు (Stem cells) అంటే ఏంటి? వాటి రకాలు? వైద్యరంగంలో ఉపయోగాలు? భారత్‌లో అభివృద్ధి, వినియోగం? ఇక్కడ స్థూలంగా మూల కణాలను వివరించేందుకు ఈ అంశాలు ఉపయోగపడతాయి. కానీ ఈ అంశంలోని అంతర్గత ఉప అంశాలపై కూడా ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం లేకపోలేదు. గతంలో ఈ తరహా ప్రశ్నలు అడిగారు కూడా. మూలకణాల అంశం నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్న అలాంటి ఉప అంశాలు...
  • థెరాపటి క్లోనింగ్
  • రీప్రోగ్రామింగ్
  • కార్‌‌డ బ్యాంకింగ్
  • పబ్లిక్ కార్‌‌డ బ్యాంకింగ్
మార్పులకు తగ్గట్టుగా:
ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అండ్ కంప్యూటర్‌‌స రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులకు తగ్గట్టుగానే ప్రిపరేషన్ సాగించాలి. జాతీయస్థాయిలో, దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ పాలనను అందించాల్సిన అవసరాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో నేషనల్ ఈ-గవర్నెన్‌‌స పాన్ (ఎన్‌ఇజీపీ) అనే ప్రణాళికను ప్రారంభించింది. ఎన్‌ఇజీపీలో మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌లు, డీఐటీ నిర్వహిస్తున్న సపోర్‌‌ట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి అధ్యయనం చేయాలి. ఇటీవలి కాలంలో ఐటీ అనువర్తనాలను పలు రంగాల్లో విరివిరిగా వినియోగిస్తున్నారు. కాబట్టి ఆయా రంగాల నేపథ్యంతో ఈ అంశాన్ని అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా ఈ-లెర్నింగ్, ఈ-కామర్‌‌స, బీపీఓ అండ్ ఐటీఇఎస్, వ్యవసాయంలో ఐటీ, ఈ-హెల్త్, పర్యావరణ నిర్వహణలో ఐటీ, ఆర్థిక వృద్ధిలో ఐటీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదనంగా కంప్యూటర్‌‌స నిర్మాణంలో వస్తున్న మార్పులను సైతం అవగతం చేసుకోవాలి. ఆధునిక ఎలక్ట్రానిక్స్‌పై కూడా దృష్టి పెట్టాలి. లెడ్ టెక్నాలజీ, బయోనిక్స్ వంటి అంశాలపై తగిన సమాచారం సేకరించాలి.

అనువర్తన దృక్పథంతో:
నానో స్థాయిలో (చిన్న) పదార్థాన్ని మనకు కావాల్సిన విధంగా మలచుకోవడమే నానో టెక్నాలజీ. ప్రస్తుతం ఉపయోగిస్తున్న అన్ని పరికరాల్లోను నానో టెక్నాలజీ వినియోగం పెరిగింది. నానో టెక్నాలజీ ద్వారా మెటీరియల్స్‌ను అభివృద్ధి చేసి వాటిని ఆటోమొబైల్స్, గృహ నిర్మాణంలో వినియోగిస్తున్నారు. నానోక్రిస్టల్స్, నానో ట్యూబ్స్ అభివృద్ధితోపాటు ఎలక్ట్రానిక్స్ వస్తువులలో నానో టెక్నాలజీ వినియోగం అధికమైంది. వాటర్ ఫ్యూరిఫైర్‌‌స, ఎయిర్ కండీషనింగ్, వాషింగ్ మెషిన్‌‌స, కంప్యూటర్‌‌స, మొబైల్స్ వీటన్నింటిలోను నానో టెక్నాలజీ అనువర్తనాల ఉపయోగం పెరిగింది. ఇటీవల కొత్తగా నానో మెడిసిన్ ప్రత్యేక రంగంగా అవతరించింది. నానో రోబోల ద్వారా చికిత్స, మాలిక్యూలర్ ఇమేజింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. కాబట్టి అభ్యర్థి నానో టెక్నాలజీ అంశాన్ని అనువర్తన దృక్పథంతో చదువుకోవాలి. అదే సమయంలో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న నానో సైన్స్ మిషన్‌పై కూడా దృష్టిపెట్టాలి.

పలు విధాలుగా:
రోబోటిక్స్ అనేది ఆధునిక రంగానికి చెందిన సాంకేతిక పరిజ్ఞానం. క్రమంగా దీని అభివృద్ధి అనువర్తన స్థాయికి చేరుకుంటుంది. రోబోటిక్స్ అంటే ఏంటి? రోబోట్స్ నిర్మాణానికి సంబంధించిన మూడు సూత్రాలు, వాటికి ఉండాల్సిన లక్షణాలు, నిర్మాణ విధానం, రోబోల రకాలు, ఉపయోగాలు ఇలా పలు కోణాల్లో చదువుకోవాలి. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఉదాహరణలను ప్రత్యేకంగా పరిశీలించాలి.
మేథో సంపత్తి హక్కుల రంగం ఇటీవల కాలంలో ప్రాధాన్యతను పెంచుకుంది. 1979 నాటికే భారత్‌లో ఇండియన్ పేటెంట్స్‌యాక్ట్ అనే చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. పూర్తిస్థాయిలో మేథో సంపత్తి రంగం అభివృద్ధి సాధించలేక పోయింది. ఫలితంగా భారత సహజ సంపదపై ఇతర దేశాలు మేథో సంపత్తి హక్కులు పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు చక్కని ఉదాహరణ వేప. మేథో సంపత్తి అంటే ఏంటి? వీటి రకాలు-ముఖ్యంగా కాపీరైట్స్, జియోగ్రాఫికల్ ఇండికేటర్, ట్రేడ్ మార్‌‌క, డిజైన్‌‌స, పేటెంట్స్ వాటి ఉదాహరణల గురించి తెలుసుకోవాలి. భారత్‌లో దీనికి సంబంధించిన చట్టాలు, వాటి అమల్లో ఉన్న ఇబ్బందులు, సమస్యలు, పరిష్కార మార్గాలు, మొదలైన అంశాలపై దృష్టి సారించాలి.

పర్యావరణం ఇలా:
ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ఒక ముఖ్యమైన అంశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అభ్యర్థులు ఈ రంగంలో పర్యావరణ కాలుష్యం (గాలి, శబ్ద, జల, భూమి, కాంతి కాలుష్యాల) కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలపై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా కాలుష్యరహిత శక్తివనరులు, ఇంధనాలు(హైడ్రోజన్, జీవ ఇంధనాలు, సహజవాయువు, సౌరశక్తి, పవనశక్తి) కాలుష్య నిర్మూలన, నియంత్రణ విధానాల (ఉదాహరణ- ఎలక్ట్రోస్టాలిక్ ప్రిసిపిటేషన్, బస్ రాపిడ్ ట్రాన్సిట్, హైడ్రోప్రిసిపిటేషన్, నల్గొండ టెక్నిక్, జీవ ఎరువులు, జీవ క్రిమి సంహారకాలు)పై దృష్టి సారించాలి.

జీవ వైవిధ్యం, రకాలు, ప్రాధాన్యత, ముప్పు, పరిరక్షణ పద్ధతులు, జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లు, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, కార్టజెనా ప్రోటోకాల్, నగోయా ప్రోటోకాల్, హైదరాబాద్‌లో జరిగిన సీఓపీ-11 సదస్సు, ఐయూసీఎన్ రెడ్ లిస్ట్, వాటిలో గుర్తించిన ముఖ్యమైన జంతు, వృక్ష జాతులు, వాటి పరిరక్షణ సమస్యలు ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, గ్రేట్ ఇండియన్ బస్టర్‌‌డ గ్యాంగ్‌టిక్ డాల్ఫిన్, లైన్ టెయిల్‌డ్ మాక్లోన్ మొదలైన వాటి గురించి చదువుకోవాలి. పర్యావరణ ప్రభావ అంచనా విధానాల్లోని లోపాలు, వీటి కారణంగా చోటు చేసుకున్న వివాదాలు, పర్యావరణ పరిరక్షణతోపాటు అభివృద్ధి రెండూ సాధ్యమయ్యే సుస్థిర విధానాలు, ప్రభుత్వం-ప్రజల మధ్య ఘర్షణ, సరైన పునరావాసం మొదలైన అంశాలను భారత దృష్టి కోణంలో అధ్యయనం చేయాలి.

ప్రిపరేషన్ ఇలా:
  • పరీక్షలో అభ్యర్థులకిచ్చే సమాధాన పత్రాల్లో జవాబు రాసేందుకు పద పరిమితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు కేవలం చదవడమే కాకుండా పూర్తి స్థాయిలో రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి.
  • పరీక్షలో సాధారణంగా 25, 50, 75, 150 పదాల పరిమితి ప్రశ్నలు అడగనున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ఒక అంశాన్ని వివిధ పద పరిమితుల్లో రాసే విధంగా శిక్షణ పొందాలి. ఉదాహరణకు గ్లోబల్ వార్మింగ్‌ను 25, 50, 75 లేదా 150 పదాల్లోనూ వివరించాల్సిన విధంగా ప్రాక్టీస్ చేయాలి.
  • ప్రెసీ సూత్రాలను పాటించి ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రయోజనకరం.
Published date : 04 Nov 2013 11:27AM

Photo Stories