నిశిత అధ్యయనంతోనే గెలుపు
Sakshi Education
సివిల్స్ మెయిన్స్- జాగ్రఫీ
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షా విధానంలో విప్లవాత్మకమైన మార్పులను యూపీఎస్సీ తీసుకొచ్చింది. జనరల్ స్టడీస్ పరిధిని విస్తృతం చేసి మరింత నిర్దేశితం చేశారు. జనరల్ స్టడీస్ పేపర్లను నాలుగుకు పెంచడమే కాకుండా టాపిక్స్‌ను సూక్ష్మ స్థాయిలో నిర్వచించారు. సమకాలీన పరిపాలనా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా టాపిక్స్ ఉండేలా చేయడంలో యూపీఎస్సీ చాలా వరకు కృతకృత్యమైనట్లే నని చెప్పాలి.
కొత్త పరీక్షా విధానంలో యూపీఎస్సీ జాగ్రఫీకి పెద్ద పీట వేసింది. పరిపాలనా వ్యవస్థలో భౌగోళిక అంశాల ప్రాధాన్యతను గుర్తిం చింది. తదనుగుణంగా కీలకమైన భౌగోళిక శాస్త్ర సంబంధిత అంశాలను కంపల్సరీ పేపర్లయిన జనరల్ స్టడీస్‌లో చేర్చింది.
పేపర్-ఐఐ, పేపర్-IV లలో భౌగోళిక శాస్త్ర సంబంధిత అంశాలను చేర్చారు. పేపర్-IIలో ప్రపంచానికి సంబంధించిన భౌగోళిక అంశాలను, కోర్ జాగ్రఫీ అంశాలను; పేపర్-IVలో భారతదేశ భౌగోళిక అంశాలను, పర్యావరణం, విపత్తు నిర్వహణ అంశాలను చేర్చారు.
పాత విధానంలో... మెయిన్స్‌లో కేవలం భారత భౌగోళిక శాస్త్ర అంశాలను మాత్రమే పొందుపరిచారు. కొత్త విధానంలో... ప్రపంచ భౌగోళిక శాస్త్ర అంశాలను కూడా చేర్చారు. భారతదేశ భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన అంశాల పరిధిని కూడా వివరంగా నిర్వచించడం గమనార్హం. ప్రధానంగా వ్యవసాయ రంగం, వ్యవసాయాధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలు, అవస్థాపనా రంగం, జనాభా, నగరీకరణ అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. భారతదేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిని నియంత్రిస్తున్న భౌగోళిక అంశాలు ఇవి కాబట్టి సహజంగానే యూపీఎస్సీ వీటికి పెద్ద పీట వేసింది.
ప్రపంచ భౌతిక భౌగోళిక శాస్త్రం ఒక ప్రత్యేక టాపిక్‌గా పేపర్-IIలో కన్పిస్తుంది. కానీ జనరల్ స్టడీస్ సిలబస్‌లో ఈ ఒక్క టాపిక్ పరిధిని వివరించకుండా వదిలేసినట్లుగా ఉంది. దాదాపుగా మిగిలిన అన్ని అంశాల పరిధిని చక్కగా, స్పష్టంగా పేర్కొన్నారు. ‘ప్రపంచ భౌతిక భౌగోళిక శాస్త్ర ప్రధాన లక్షణాలు’ అని మాత్రమే పేర్కొనడంతో కొంత గందరగోళం, అస్పష్టత తప్పనిసరి. ఇందులో భాగంగా ప్రపంచ నైసర్గిక స్వరూపం, నదులు, నేలలు, అడవులు, శీతోష్ణస్థితి వంటి అంశాలను అధ్యయనం చేయాల్సి వస్తుంది. కానీ దీని పరిధి, విస్తృతి చాలా ఎక్కువ. ఐతే మొత్తం సిలబస్‌లో సంభవించిన మార్పుల సరళిని పరిశీలిస్తే కచ్చితంగా యూపీఎస్సీ ఎగ్జామినర్ అప్లయిడ్ అంశాలు, సమకాలీన అంశాలకే ప్రాధాన్యత ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అంటే ప్రపంచ భౌతిక భౌగోళిక అంశాల్లో కూడా సమకాలీన ప్రాధాన్యత ఉన్న అంశాలను లేదా సామాజిక, ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేస్తున్న అంశాలను మాత్రమే స్పృశించే అవకాశముంది.
ప్రపంచ నైసర్గిక స్వరూపాలు, ప్రపంచ నదీ వ్యవస్థలు, అడవుల గురించి విస్తృతంగా చదవాల్సిన అవసరం లేదు. కానీ నైసర్గిక స్వరూపం ఆయా దేశాల సామాజిక, ఆర్థిక వ్యవస్థలను ఏ రకంగా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలపై నైసర్గిక స్వరూపం ప్రభావం అధికంగా కన్పిస్తోంది. సమకాలీనంగా వార్తల్లో ఉన్న దేశాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు సూడాన్, మాల్ వంటి దేశాల నైసర్గిక స్వరూపాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, నైసర్గిక స్వరూపం అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను ఏ రకంగా ప్రభావితం చేస్తుందో విశ్లేషించుకోవాలి. ప్రపంచ భౌతిక భౌగోళిక శాస్త్రం అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ పర్వతాలు, పీఠభూములు, నదులు ఉన్నాయో కంఠస్థం చేయడం కాదని గుర్తించాలి. ప్రశ్నలు కచ్చితంగా సమకాలీన, అనువర్తిత అంశాలపైనే ఉంటాయి. సహజ వనరుల విషయానికొస్తే.. నదులు, అడవులు, ఖనిజ వనరులను స్థూలంగా అధ్యయనం చేస్తూ ఆర్థికాభివృద్ధిలో వాటి పాత్రను స్పష్టంగా గుర్తించాలి. వీటిని సమకాలీన అంశాలకు అన్వయించుకోవాలి. ఉదాహరణకు దక్షిణాసియాలో భారతదేశం ఏ వనరుల కోసం ఏ దేశం వైపు చూస్తుంది? సహజ వనరులు మన ద్వైపాక్షిక సంబంధాలపై ఏ రకమైన ప్రభావం చూపుతున్నాయనే అంశాలను విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు భారత రాష్ట్రపతి ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా అక్కడి సహజ వనరులు భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయని అడగొచ్చు.
పరిశ్రమల ఉనికిని ప్రభావితం చేస్తున్న అంశాలను అధ్యయనం చేసేటప్పుడు సమకాలీన ఉదాహరణలను కచ్చితంగా సేకరించాలి. ఉదాహరణకు ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు తయారీ పరిశ్రమల ఉనికిని ప్రభావితం చేసిన అంశాలను పరిశీలిస్తూ, ఇటీవల ఉక్కు తయారీ రంగం క్రమంగా భారత్, బ్రెజిల్, చైనాల వైపు ఎందుకు విస్తరిస్తుందో విశ్లేషించాలి. అదే విధంగా ఆటోమొబైల్ పరిశ్రమల ఉనికి, విస్తరణలో ఇటీవల సంభవిస్తున్న మార్పులను నిశితంగా అధ్యయనం చేయాలి. ప్రపంచీకరణ ప్రభావం వివిధ పరిశ్రమల ఉనికి, విస్తరణలో తీసుకొస్తున్న మార్పులను ప్రధానంగా గుర్తించాలి.
భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత ప్రక్రియలను గురించిన ప్రాథమిక శాస్త్రీయ భావాలను అర్థం చేసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రక్రియలు ఏ ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయో గుర్తించి సంబంధిత కారణాలను విశ్లేషించాలి. ఉదాహరణకు పసిఫిక్ సముద్ర తీర ప్రాంతాల్లో భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు ఎందుకు కేంద్రీకృతమై ఉన్నాయో అధ్యయనం చేయాలి. అంటే పలక విరూపణ సిద్ధాంతానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను ఈ ప్రాంతానికి అన్వయించి పరిశీలించాలి.
జలరాశులు, హిమఖండాలు, వృక్ష, జీవ జాతుల ఉనికిలో మార్పులు అంటే.. ప్రపంచ పర్యావరణ సమస్యలైన గ్లోబల్ వార్మింగ్, జీవ వైవిధ్య క్షీణత వంటి అంశాలను అనువర్తించాల్సి ఉంటుంది.
జనాభా పరివర్తన నమూనా, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల జనాభా సమస్యల్లో తేడాలు మొదలైన అంశాలను క్షేత్ర స్థాయి ఉదాహరణలతో అధ్యయనం చేయాలి. జనాభా అధ్యయనాన్ని పేదరికం, అభివృద్ధి అంశాలతో సమన్వయం చేస్తూ విశ్లేషించాలి. ఇటీవల నగరీకరణ వృద్ధిరేటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే అధికంగా ఉంటోంది. అభివృద్ధి చెందుతున్న తృతీయ ప్రపంచ దేశాల నగర జనాభా, అభివృద్ధి చెందిన దేశాల నగర జనాభాను మించిపోయిన నేపథ్యంలో నగరీకరణం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తృతీయ ప్రపంచ దేశాల నగరీకరణ సమస్యలకు వినూత్న పరిష్కారాల ఆవశ్యకత కన్పిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల నగర ప్రణాళికల్లో జరిగిన తప్పులు ఇక్కడ పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా నగర ప్రణాళికల గురించి సమగ్ర అవగాహన చాలా అవసరం. నగరాల్లో రవాణా, కాలుష్యం, పౌర సదుపాయాలు, మురికివాడలు మొదలైన ప్రధాన సమస్యలకు ఏ రకమైన ప్రణాళికలు, పథకాలను అమలు చేస్తున్నాయో మొదలైన అంశాలపై అవగాహన పెంచు కోవాలి.
పేపర్-IVలో నాలుగు ఉప విభాగాలు నేరుగా భౌగోళిక శాస్త్రానికి సంబంధించినవి. ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ప్రాముఖ్యతనిచ్చారు. కోర్ ఎకానమీకి సంబంధించిన ప్రణాళికలు, వనరుల సమీకరణ, వృద్ధిరేటు, ఉపాధి బడ్జెట్, సమ్మిళిత వృద్ధి మొదలైన అంశాలను కేవలం మూడు ఉప విభాగాలుగా గుర్తించారు. పేపర్-IVను జాగ్రత్తగా పరిశీలిస్తే కింది విషయాలు అవగతమవుతాయి.పేపర్-IV
పైన సూచించిన పట్టికలో ఎకానమిక్ జాగ్రఫీ, పర్యావరణం, విపత్తు నిర్వహణ అంశాలు భౌగోళిక శాస్త్ర పరిధికి సంబంధించినవి. వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల రీతులు, సేద్యపు నీటి వ్యవస్థలు, మార్కెటింగ్ రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించారు. పరిశ్రమల్లో కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మాత్రమే సిలబస్‌లో ప్రస్తావించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగానికున్న ప్రాధాన్యతను గుర్తించి సిలబస్‌లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని చేర్చారు.
మొత్తం మీద ఆర్థిక వ్యవస్థకు సంబంధించిఅనువర్తిత, అనుబంధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, అవస్థాపనా రంగాలను ప్రత్యేక ఉప విభాగాలుగా గుర్తించడంలో రాబోయే సంవత్సరాల్లో యూపీఎస్సీ పేపర్‌లో గుణాత్మక మార్పులు సంభవించడం తథ్యం.
సిలబస్‌లో మార్పులను గమనిస్తే గణాంకాలు, పథకాల పేర్లు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆధారిత ప్రశ్నలు, గైడ్లు, స్టడీ మెటీరియల్స్‌కు కాలం చెల్లినట్లే లెక్క. ఒక రకంగా చూస్తే సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడంలో ఉండే ఇబ్బందుల నుంచి విముక్తి లభించినట్లే.
బహుశా ఎగ్జామినర్ సమగ్ర అవగాహన, సమస్యా విశ్లేషణ, భావ వ్యక్తీకరణలను పరీక్షించే దిశగా ప్రశ్నలను రూపొందించే అవకాశం ఉంది. తెలివైన విద్యార్థికి దీనివల్ల ప్రిపరేషన్ భారం తగ్గిపోతుంది. అంటే పట్టుదలతో శ్రమించే విద్యార్థికి ఏడాది ప్రిపరేషన్‌తో మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడానికి మార్గం సుగమం అయినట్లే.
పేపర్-II
Advanced Economic Geogra-phy - Dr. Alka Gowtham
Certificate course in Physical Geography - Goh cheng Leong
Frank Modern Certificate Geography
Economic Survey
Indian Geography - Khuller
Urban Geography - R.B. Ma-ndal
India Year Book

అంశం | ఉప విభాగాల సంఖ్య |
కోర్ ఎకానమీ | 3 |
అప్లయిడ్ ఎకానమీ | 3 |
ఎకానమిక్ జాగ్రఫీ | 4 |
పర్యావరణం, విపత్తు నిర్వహణ | 2 |
సైన్స్ అండ్ టెక్నాలజీ | 3 |
అంతర్గత, ఇతర భద్రత - | 5 |
మొత్తం | 20 |
పైన సూచించిన పట్టికలో ఎకానమిక్ జాగ్రఫీ, పర్యావరణం, విపత్తు నిర్వహణ అంశాలు భౌగోళిక శాస్త్ర పరిధికి సంబంధించినవి. వ్యవసాయ రంగానికి సంబంధించి పంటల రీతులు, సేద్యపు నీటి వ్యవస్థలు, మార్కెటింగ్ రంగాలను ప్రాధాన్యతా రంగాలుగా గుర్తించారు. పరిశ్రమల్లో కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మాత్రమే సిలబస్‌లో ప్రస్తావించారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగానికున్న ప్రాధాన్యతను గుర్తించి సిలబస్‌లో ప్రత్యేకంగా ఈ అంశాన్ని చేర్చారు.
మొత్తం మీద ఆర్థిక వ్యవస్థకు సంబంధించిఅనువర్తిత, అనుబంధ రంగాలైన వ్యవసాయం, పరిశ్రమలు, అవస్థాపనా రంగాలను ప్రత్యేక ఉప విభాగాలుగా గుర్తించడంలో రాబోయే సంవత్సరాల్లో యూపీఎస్సీ పేపర్‌లో గుణాత్మక మార్పులు సంభవించడం తథ్యం.
సిలబస్‌లో మార్పులను గమనిస్తే గణాంకాలు, పథకాల పేర్లు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఆధారిత ప్రశ్నలు, గైడ్లు, స్టడీ మెటీరియల్స్‌కు కాలం చెల్లినట్లే లెక్క. ఒక రకంగా చూస్తే సమాచారాన్ని గుర్తు పెట్టుకోవడంలో ఉండే ఇబ్బందుల నుంచి విముక్తి లభించినట్లే.
బహుశా ఎగ్జామినర్ సమగ్ర అవగాహన, సమస్యా విశ్లేషణ, భావ వ్యక్తీకరణలను పరీక్షించే దిశగా ప్రశ్నలను రూపొందించే అవకాశం ఉంది. తెలివైన విద్యార్థికి దీనివల్ల ప్రిపరేషన్ భారం తగ్గిపోతుంది. అంటే పట్టుదలతో శ్రమించే విద్యార్థికి ఏడాది ప్రిపరేషన్‌తో మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించడానికి మార్గం సుగమం అయినట్లే.
పేపర్-II
- ప్రపంచ భౌతిక భౌగోళిక శాస్త్ర ప్రధాన అంశాలు.
- భారత ఉపఖండం, దక్షిణాసియాతో సహా ప్రపంచంలో ప్రధాన సహజ వనరుల విస్తరణ.
- భారతదేశంతో సహా ప్రపంచంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలకు చెందిన పరిశ్రమల ఉనికిని ప్రభావితం చేస్తున్న అంశాలు.
- తుఫానులు, అగ్నిపర్వత ప్రక్రియ, సునామీలు, భూకంపాలు వంటి ప్రధాన భూ భౌతిక దృగ్విషయాలు.
- జలరాశులు, హిమఖండాలతో సహా కీలకమైన భౌగోళిక స్వరూపాలు, వృక్షజాలం, జంతుజాలాల ఉనికి, ఉనికిలో మార్పులు, ఈ మార్పుల ప్రభావం.
- జనాభా-సంబంధిత సమస్యలు
- పేదరికం, అభివృద్ధి సమస్యలు
- నగరీకరణం-సమస్యలు, పరిష్కారాలు
- దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన పంటలు, పంటల రీతులు.
- వివిధ రకాల సేద్యపు నీటి వ్యవస్థలు.
- వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ, రవాణా, మార్కెటింగ్-సమస్యలు, అడ్డంకులు.
- వ్యవసాయదారుని సేవలో ఈ- టెక్నాలజీ.
- భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్, సంబంధిత పరిశ్రమల పరిధి, ప్రాముఖ్యత, ఉనికి, సరఫరా శృంఖలం నిర్వహణ.
- భారతదేశంలో భూ సంస్కరణలు.
- అవస్థాపనా సౌకర్యాలు: శక్తి, రేవు పట్టణాలు, రహదారులు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు.
- పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, క్షీణత, పర్యావరణ ప్రభావ మూల్యాంకనం.
- విపత్తులు, విపత్తు నిర్వహణ.
Advanced Economic Geogra-phy - Dr. Alka Gowtham
Certificate course in Physical Geography - Goh cheng Leong
Frank Modern Certificate Geography
Economic Survey
Indian Geography - Khuller
Urban Geography - R.B. Ma-ndal
India Year Book
Published date : 04 Apr 2013 07:39PM