ఫ్రెషర్లకు తీపికబురు: ఈ ఏడాది ఎల్‌టీఐలో కొత్తగా 4,500 కొలువులు
Sakshi Education
ముంబై: లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్ (ఎల్‌టీఐ) ఈ ఏడాది సుమారు 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది.
భారీ స్థాయి అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలస) సమస్యను అధిగమించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్‌టీఐ గతేడాది 3,000 మందిని రిక్రూట్ చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 18.3%గా ఉన్న అట్రిషన్ రేటు హైరింగ్ పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 15.2%కి తగ్గింది. అయితే, సీక్వెన్షియల్‌గా మార్చి త్రైమాసికంలో నమోదైన 12.3%తో పోలిస్తే మాత్రం పెరిగింది. కంపెనీ సీఈవో సంజయ్ జలోనా ఈ విషయాలు తెలిపారు. ఐటీ రంగంలో మార్కెట్ దిగ్గజం టీసీఎస్‌లో అట్రిషన్ రేటు క్యూ1లో అత్యల్పంగా 8.6%గా (మార్చి క్వార్టర్‌లో 7.2 %) నమోదైంది. అటు ఇన్ఫోసిస్‌లో 13.9% (మార్చిలో 10.9%), విప్రోలో 15.5% (మార్చి త్రైమాసికంలో 12%)గా అట్రిషన్ రేటు ఉంది. జూన్ త్రైమాసికంలో కాగి్నజెంట్‌లో అత్యధికంగా 31 శాతంగా నమోదైంది.

Published date : 20 Aug 2021 07:14PM