Skip to main content

కువైట్‌లో 200కు పైగా ఉద్యోగావకాశాలు: ఆసక్తి గలవారు సంప్రదించండి..

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువత కువైట్‌లో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఓమ్ క్యాప్) సంస్థలు కలిసి పని చేయనున్నాయి.
కువైట్ గేట్ ఫౌండేషన్ ఎండీ హసన్‌తో ఏపీఎస్‌ఎస్‌ఐడీసీ ఎండీ అండ్ సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఓం క్యాప్ జనరల్ మేనేజర్ డాక్టర్ కేవీ స్వామి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కువైట్ లో ఇంటిపని, బ్యూటీషియన్, డ్రైవర్ ఉద్యోగాల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు 62 మంది హాజరయ్యారని ఓమ్ క్యాప్ జీఎం డాక్టర్ కేవీ స్వామి తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.హనుమనాయక్, సీజీఎం నాన్ టెక్నికల్ కృష్ణమోహన్ ఎంపికై న వారందరికీ ధ్రువీకరణ పత్రాలు అందించారు. వారందరికీ ఉచిత నివాసం, భోజన వసతితోపాటు ఉచిత వీసా, విమాన ప్రయాణ ఖర్చులు కువైట్ గేట్ ఫౌండేషన్ ద్వారా అందిస్తారు. కువైట్‌లో ఇంకా సుమారు 200కు పైగా ఇంటిపని, వంటపని, బ్యూటీషియన్ ఉద్యోగాలు ఉన్నాయని.. ఆసక్తి గలవారు 75699 91966, 77949 43108, 08662 485348 నంబర్లలో సంప్రదించాలని ఓమ్ క్యాప్ జీఎం సూచించారు.
Published date : 22 Dec 2020 06:30PM

Photo Stories