Skip to main content

RBI grade b 2023 Notification: ఆర్బీఐలో 291 ఆఫీసర్ పోస్టులు... పూర్తి వివ‌రాలు ఇవే

భార‌తదేశ కేంద్ర బ్యాంక్ అయిన రిజ‌ర్వ్ బ్యాంక్ 291 ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న‌ ఆర్‌బీఐ శాఖల్లో ఉన్న ఖాళీల‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భర్తీ చేయ‌నున్నారు. పోస్టుల‌ను అనుస‌రించి డిగ్రీ, పీజీ అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
RBI-grade b Notification
RBI-grade b Notification

ఖాళీల వివరాలు:
ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- జనరల్: 222 పోస్టులు
ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఈపీఆర్: 38 పోస్టులు
ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్‌ఐఎం: 31 పోస్టులు

RBI

అర్హత: డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులు 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఆర్బీఐ గ్రేడ్ బీ 2023 పరీక్షకు జనరల్, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు రూ.100

వ‌య‌సు: 
ఆర్బీఐ ఆఫీసర్ (గ్రేడ్ స‌బి) : 21 నుంచి 30 ఏళ్ల‌ మధ్య ఉండాలి. ఎంఫిల్ అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ట వ‌య‌సు 32 ఏళ్లు, పీహెచ్ డీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు.

RBI

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-05-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-06-2023.

ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) జనరల్- ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 09-07-2023; ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 30-07-2023.

ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) డీఈపీఆర్‌- ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 16-07-2023; ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 02-09-2023.

ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం- ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 16-07-2023; ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 19-08-2023.

పూర్తి వివ‌రాల‌కు: https://www.rbi.org.in/ సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

Published date : 26 Apr 2023 05:35PM

Photo Stories