Jobs: విదేశాల్లో ఉద్యోగాలు.. అర్హులు వీరే..
Sakshi Education
బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం డిప్లొమా చదివినవారు జపాన్, జర్మనీ దేశాల్లో నర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.దేవేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
జర్మనీలో నర్సింగ్ అప్రెంటిస్‌షిప్‌కు ఇంటర్మీడియట్‌లో 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు అర్హులన్నారు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ ఫ్రెషర్స్ లేదా హోటల్ లేదా రెస్టారెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్‌లో ఏడాది అనుభవం ఉండి, 20 నుంచి 27 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు జపాన్‌లో హాస్పిటాలిటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్, పెయింటర్, ప్లంబర్, కార్పెంటర్‌గా రెండేళ్లు అనుభవం , ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిసెంబర్ 28న బస్‌స్టేషన్ ఎదురుగా గల నెహ్రూ యువ కేంద్రంలో టామ్‌కామ్ ఎంపిక పరీక్ష నిర్వహిస్తుందని పేర్కొన్నారు. వివరాలకు 82478 38789, 89190 47600, 95739 45684 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Free Coaching: పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎక్కడంటే..
Published date : 28 Dec 2023 08:49AM