ఈ శాఖలోని 12000 పోస్టుల భర్తీకి గీన్ సిగ్నల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులు భర్తీ చేయడానికి అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులు క్లియర్ అయ్యాయి.
దీంతో వాటన్నిటినీ భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ బలోపేతంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఖాళీలను ప్రతి 6నెలలు లేదా ఏడాదికో సారి భర్తీ చేసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందువల్ల ఇక నుంచి డాక్టర్ల కొరత ఉండబోదని ఉపసంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8వ తేదీన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. దీనికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షత వహించారు. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.
Published date : 09 Oct 2020 04:04PM