ఎస్సీ గురుకులాల్లో 595 మందికి శాశ్వత ఉద్యోగాలు
Sakshi Education
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలో 595 మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆర్డర్ కాపీలు అందజేశారు.
టీజీటీ పోస్టులకు సంబంధించి 400 మందికి ఈనెల 13న పోస్టింగ్ ఆర్డర్ కాపీలు ఇవ్వగా, 19న 21 మందికి ఆర్డర్ కాపీలు అందజేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 10న 750 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఆర్డర్‌లు అందజేశారు.
Published date : 20 Feb 2020 02:01PM