ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖకు శాశ్వత ఉద్యోగులు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మైనార్టీ సంక్షేమ పథకాలను సమర్థంగా నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖకు సర్వీస్ రూల్స్ రూపొందించింది. శాశ్వత ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది.
కమిషనర్ కార్యాలయం, జిల్లాల్లో కలిపి మొత్తం 60 పోస్టులు భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు మైనార్టీ సంక్షేమ శాఖకు సర్వీస్ రూల్స్‌లేవు. తాజాగా జరిగిన ఫైనాన్‌స డిపార్ట్‌మెంట్ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించారు. ప్రస్తుతం ఆరు మైనార్టీ గురుకులాలు, ఏడు సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. మైనార్టీ సంక్షేమ గురుకులాల నిర్వహణ ఏపీ గురుకుల సొసైటీ కింద ఉంది. ప్రత్యేకించి మైనార్టీ గురుకుల సొసైటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి మైనార్టీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపింది. దీంతో గురుకులాలు, హాస్టళ్లకు ప్రత్యేకంగా శాశ్వత ఉద్యోగులు రానున్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో 11 గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల భవనాలు కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది నిర్మాణాలు పూర్తవుతాయని ఇంజనీర్లు తెలిపారు. ప్రస్తుతం గురుకులాలు, హాస్టళ్లు అద్దె భవనాల్లోనే ఉంటున్నాయి. సరైన వసతుల్లేవు. భవనాల నిర్మాణాలు పూర్తి కాగానే అద్దె భవనాలు ఖాళీ చేసి కొత్తగా నిర్మించిన భవనాల్లో హాస్టళ్లు, గురుకుల స్కూళ్లు ఏర్పాటు చేస్తారు.
వక్ఫ్ భూముల రెండో దశ సర్వే త్వరలో పూర్తి
వక్ఫ్ భూముల రెండో దశ సర్వే త్వరలో పూర్తి కానుంది. ఇప్పటికే కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సర్వే ఒక దశకు వచ్చింది. రికార్డుల నవీకరణ పూర్తిస్థాయిలో జరగాల్సి ఉంది. మొత్తం ఎనిమిది టీముల ద్వారా వక్ఫ్ భూముల సర్వే నిర్వహిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ చెప్పారు.

Published date : 01 Feb 2020 04:10PM