Skip to main content

Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Various Jobs in APVVP hospitals

మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో పలు ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆడియో మెట్రిషియన్‌, డెంటల్‌ టెక్నీషియన్‌, రేడియోగ్రాఫర్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో, థియేటర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేస్తామని కలెక్టర్‌ ఎ.మల్లికార్జున ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అన్ని ధ్రువీకరణపత్రాల జిరాక్స్‌ కాపీలతో దరఖాస్తు చేయాలని సూచించారు. దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆస్పత్రుల సేవల సమన్వయ అధికారి వారి కార్యాలయం, గవర్నమెంట్‌ ఆస్పత్రి, పెందుర్తి కార్యాలయంలో అందజేయాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి టి.రమేష్‌ కిశోర్‌ తెలిపారు. విద్యార్హతలు, ఖాళీల వివరాలు, వయో పరిమితి, ఇతర వివరాలను https:// visakhapatnam.ap.gov.inలో పొందుపరిచినట్లు చెప్పారు.

చ‌ద‌వండి: Physical Endurance Test: ఎస్‌ఐ పురుష అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు మళ్లీ ప్రారంభమయ్యాయి

Published date : 05 Sep 2023 05:01PM

Photo Stories