Telangana Teaching Jobs: లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం... ఇలా అప్లై చేసుకోండి
Sakshi Education
కామర్స్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల గ్రామంలో ఉన్న తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్ల పోస్టులను పార్ట్‌టైం పద్ధతిలో భర్తీ చేయనుండగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వి.ఉమాదేవి తెలిపారు.
AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
కామర్స్ సబ్జెక్ట్‌లో పీజీతో పాటు పీహెచ్‌డీ అర్హత కలిగి ఉండి సెట్, నెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇద్దరు లెక్చరర్లకు అవకాశం ఉండగా, రెండేళ్ల బోధన అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఆసక్తి, అర్హతలు గల వారు నేరుగా కళాశాలలో సంప్రదించాలని, వివరాలకు 94910 63083 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Fresher Jobs: ఆంగ్లంపై పట్టు ఉందా... అయితే మీ కోసం 200 ఉద్యోగాలున్నాయి!
Published date : 19 Jul 2023 05:42PM