Mental wellbeing: జీతం ఎంతైనా పర్లేదు.. ఒత్తిడి లేని ఉద్యోగం చాలు
ఒత్తిడి లేని ఉద్యోగాల్లో తక్కువ జీతానికైనా పని చేసేందుకు వెనుకాడటం లేదని వెల్లడించింది. ఇదే అమెరికాలో 70 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయంతో పోలిస్తే భారత్‌లోనే ఈ అభిప్రాయం గల ఉద్యోగులు అధికంగా ఉండటం విశేషం. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోని ఉద్యోగాల్లో వర్క్‌ఫోర్స్, ప్రోత్సాహకాలు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
చదవండి: ఎనిమిదో తరగతి చదివిన మన తెలుగు మహిళ.. ఐఏఎస్‌లకు పాఠాలు చెప్పేస్థాయికి ఎదిగింది
కుటుంబానికే తొలి ప్రాధాన్యం
భారతీయ ఉద్యోగుల్లో ఇటీవల కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యతలో తీవ్ర మార్పు వచ్చింది. 46 శాతం మంది ఉద్యోగం కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యం అని అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో 37 శాతం మంది పని (ఉద్యోగం).. ఆ తర్వాతే ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, వ్యాయామం, స్నేహితులతో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఇక్కడ చాలామంది ఉద్యోగులు తమ ఆందోళనలను మేనేజర్లతో పంచుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెప్పింది. భారత్‌లో 51 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రతి వారం తమ మేనేజర్‌తో పనిభారంపై చర్చిస్తుండగా.. 30 శాతం మంది నెలకు ఒకసారి కూడా మాట్లాడలేకపోతున్నారని నివేదించింది.
ఒత్తిడి ఇంత పని చేస్తోందా!
33% భారతీయ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడపటం పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దీనివల్ల 34 శాతం మందిలో గతంతో పోలిస్తే పని గంటలు పెరగడంతో ఏకాగ్రత కోల్పోతున్నట్టు గుర్తించింది. 31 శాతం మందిలో సహాద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించలేని పరిస్థితి కనిపించింది. మిగిలిన వారిలో పని ఉత్పాదకత, సామర్థ్యం కొరవడుతున్నట్టు తేల్చింది.
చదవండి: విద్యార్థులకు ఉచితంగా బ్రేక్ ఫాస్ట్... సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
సాంకేతిక వనరులపై పెట్టుబడి పెంచాలి
ఉద్యోగానికి ఉండే డిమాండ్, హార్డ్ వర్క్ చేయాలనే తపన కూడా ఒత్తిడికి కారణంగా పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడు వారు మెరుగ్గా పని చేయగలుగుతారు. సాంకేతిక వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగులపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఆ సంస్థ స్థిరత్వానికి ఎంతో దోహదం చేస్తుంది’ అని యూకేజీ ఇండియా కంట్రీ మేనేజర్ సుమిత్ దోషి చెప్పారు.