Skip to main content

అన్‌లాక్ తర్వాత జాబ్‌లు పెరిగాయ్..!: లింక్డ్‌ఇన్ నివేదిక

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ సడలింపుతో భారత్‌లో ఉద్యోగ నియామకాలు చెప్పుకోదగిన స్థాయిలో పెరిగాయి.
ఈ ఏప్రిల్ చివరి నుంచి జూన్ మధ్యకాలంలో ఉద్యోగ నియామకాలు 35శాతం పెరిగినట్లు ప్రొఫెనషల్ నెట్‌వర్కింగ్ ఫ్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ తన నివేదికలో పేర్కోంది. వార్షిక ప్రాతిపదిక ఏప్రిల్‌లో ఉద్యోగాల కల్పన మైనస్50 శాతంగా నమోదైంది. అయితే జూన్ చివరినాటికి ఉద్యోగ కల్పన మైనస్ 15శాతానికి చేరుకున్నట్లు సర్వే తెలిపింది. రెండో దశ కొవిడ్ కేసులు భారీగా పెరగడంతో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధింపును ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఈ అనిశ్చితితో రాబోయే రోజుల్లో ఉద్యోగ నియామకాలు ఫ్లాట్‌గా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. కొవిడ్ తర్వాత ఉద్యోగాల కొరకు పోటీతత్వం రెండింతలైందని, అయితే జెండర్(ఆడ, మగ) నియామకాల మధ్య అంతరం తగ్గినట్లు సర్వేలో తేలింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ డెవెలప్‌మెంట్ మేనేజర్, సేల్స్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, కంటెంట్ రైటర్ ఉద్యోగాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉన్నట్లు నివేదిక తెలిపింది. జావాస్క్రిప్ట్, ఎస్‌క్యూఎల్, సేల్స్ మేనేజ్‌మెం ట్, టీమ్ లీడర్ షిప్, రిక్రూటింగ్‌లు టాప్-5 డిమాండ్ స్కిల్స్‌లో సర్వే పేర్కోంది.
Published date : 18 Aug 2020 01:49PM

Photo Stories