Skip to main content

8 ఏబీసీడబ్ల్యూవో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ సహాయ అధికారుల (ఏబీసీడబ్ల్యూవో) పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.
బీసీ సంక్షేమ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 8 ఏబీసీడబ్ల్యూవో పోస్టులను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసుకునేందుకు అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌రాస్ఫిబ్రవరి 20 (గురువారం)న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అన్ని వివరాలను వెంటనే టీఎస్‌పీఎస్సీకి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 21 Feb 2020 01:37PM

Photo Stories