62 శాతం మంది ఉద్యోగాలు మారాలని చూస్తున్నారు: లింక్డ్‌ఇన్సర్వే
Sakshi Education
న్యూఢిల్లీ: దేశంలో 62 శాతం మంది వృత్తి నిపుణులు ఉద్యోగం మారాలని అనుకుంటున్నారని ప్రొఫెషనల్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్ తెలిపింది.
లింక్డ్‌ఇన్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ప్రకారం అయిదుగురిలో ముగ్గురు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి ఇతర విభాగాలవైపు చూస్తున్నారు. వినోదం, యాత్రలు, రిటైల్, కార్పొరేట్ సర్వీసెస్ రంగంలో పనిచేస్తున్నవారిలో అత్యధికులు కొత్త కెరీర్‌కు మళ్లాలని భావిస్తున్నారు. ప్రొఫైల్‌లో అయిదు రకాల నైపుణ్యాలున్నవారికి 27 రెట్లు మెరుగ్గా నియామక కంపెనీలను ఆకట్టుకునే అవకాశం ఉంది.
Published date : 25 Nov 2020 03:48PM