JEE Mains Result 2023 : జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. తొలిసారిగా..
ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
Online Class: JEE MAINS 2023 Expected Marks (vs) Rank (vs) Percentile
ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు రెండోవిడత..
జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్‌టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు.
Target JEE (Mains) 2023: how to score more marks ?
ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్‌కు సంబంధించిన అప్లికేషన్ ఫారం https:// jeemain. nta. nic. in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్‌లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేయనుంది. ఆ తర్వాత ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటించనుంది. వీరిలో టాప్ 2.2లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.