JEE Main 2022 Results : జేఈఈ మెయిన్-2 ఫలితాలు విడుదల.. సీట్ల భర్తీ మాత్రం ఇలా..
తెలుగు విద్యార్థి పి రవిశంకర్ ఆరో ర్యాంక్ సాధించగా.. హిమవంశీకి ఏడో ర్యాంక్, పల్లి జయలక్ష్మికి 9వ ర్యాంక్ వచ్చింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ఫైనల్ కీని మాత్రమే రిలీజ్‌చేసిన ఎన్‌టీఏ.. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
JEE Main Result 2022 Session 2 Direct Link ( Click Here)
34,319 సీట్లు.. కానీ భర్తీ మాత్రం..
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో 16,050 సీట్లు, ఎన్‌ఐటీల్లో 23,056, ఐఐఐటీల్లో 5,643, కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే సంస్థల్లో 5,620... వెరసి 50,369 సీట్లు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నాయి. అడ్వాన్స్‌తో భర్తీ చేసే ఐఐటీ సీట్లు 16,050 పక్కనబెడితే మిగిలిన 34,319 సీట్లు జేఈఈ మెయిన్స్ ర్యాంకు ద్వారానే భర్తీ చేస్తారు.
అసలైన టెన్షన్ ఇక్కడే..
ఇందులో లభించే ర్యాంకు ఆధారంగానే IIT కాలేజీల్లో సీట్లు లభిస్తాయి. ఇలా అడ్వాన్స్‌డ్ ర్యాంకును బట్టి ఐఐటీల్లో సీటు వస్తే.. JEE Main ర్యాంకు ఆధారంగా NITలు, ఐఐఐటీల్లో Engineering సీట్లు పొందే అవకాశం ఉంది. ఇక్కడే విద్యార్థుల్లో అసలైన టెన్షన్ మొదలవుతుంది. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వస్తుందో? JEE Advancedకు ఎంపిక కాకుంటే..? ఆ ర్యాంకుతో నిట్‌లు, ఇతర విద్యాసంస్థల్లో సీటు వస్తుందా? రాదా? అనే ఆలోచనతో సమమతమవుతుంటారు. చాలామందిలో ఉన్న అపోహ ఏమిటంటే.. JEE Mainsలో 10 వేల పైన ర్యాంకు వస్తే ఎన్‌ఐటీల్లో సీటు కోసం ప్రయత్నించడం వృధా అని. అయితే ఇది ముమ్మాటికీ తొందరపాటు చర్యే అంటున్నారు నిపుణులు. ‘గత కొన్నేళ్ళుగా ఏ సంస్థలో ఏ ర్యాంకు వరకు సీట్లు కేటాయించారు? పోటీ ఎలా ఉంది? అనే దానిపై విద్యార్థులు కొంత కసరత్తు చేయాలి. అలాగే తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకూ వేచి చూడాలి..’అని స్పష్టం చేస్తున్నారు.
ఎక్కువ ర్యాంకు వచ్చినా..
ఎన్‌ఐటీలు అంటే ఐఐటీల తర్వాత దేశంలో పేరెన్నికగన్న విద్యా సంస్థలు. వీటిల్లో ఏ కోర్సు చేసినా జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో కంపెనీలు భారీ వేతనాలిచ్చి ఎంపిక చేసుకుంటాయి. కాబట్టి ఫలానా కోర్సే కావాలి.. ఫలానా ఎన్‌ఐటీలోనే కావాలనే విషయాన్ని విద్యార్థులు పక్కన బెడితే, కాస్త ఎక్కువ ర్యాంకులోనూ సీటు ఈజీగానే సంపాదించే వీలుందని గత కొన్నేళ్ళ కౌన్సెలింగ్ డేటా చెబుతోంది.