Skip to main content

JEE Advanced 2022 Result : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల.. క్వాలిఫయింగ్‌ మార్కులు ఇంతేనా..?

సాక్షి ఎడ్యుకేషన్‌ : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2022 పరీక్షను ఆగస్టు 28న నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.
JEE Advanced 2022
JEE Advanced 2022 Result

ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించింది. ఈ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 ఫలితాలతో పాటు.. ఫైన‌ల్ కీ కుడా సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.  అభ్యర్థులు https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను కూడా చెక్‌ చేసుకోవచ్చు.

చదవండి: NIT, IIIT: ఈ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కోర్సు పూర్తి చేసుకుంటే.. ఉజ్వల కెరీర్‌ సొంతం

JEE Advanced Result 2022 : How To Download Scorecard
➤ Visit the official website https://jeeadv.ac.in/
➤ Click on JEE Advanced 2022 result link
➤ Insert login credentials- JEE Advanced registration number and date of birth
➤ Click on submit
➤ Download JEE Advanced 2022 scorecard, take a print out for further reference.

సెప్టెంబర్‌ 12 నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

చదవండి: Best Engineering Branch: బీటెక్‌... కాలేజ్, బ్రాంచ్‌ ఎంపిక ఎలా

క్వాలిఫయింగ్‌ మార్కులు ఇంతేనా..?

JEE

జేఈఈ అడ్వాన్స్‌డ్ కష్టంగా ఉండటం వల్ల క్వాలిఫయింగ్‌ మార్కులు అదే రీతిలో ఉండే వీలుందని నిపుణులు అంటున్నారు. మొత్తం 360 మార్కులకు ప్రతి ప్రతి సబ్జెక్టులో 5 శాతం మార్కులతో ఓపెన్‌ కేటగిరీలో 60 మార్కులు తెచ్చుకుంటే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్టేనని చెబుతున్నారు. ఓబీసీ–నాన్‌ క్రీమీలేయర్‌ కేటగిరీలు ప్రతి సబ్జెక్టులో 4 శాతంతో 50 కనీస మార్కులు, ఎస్సీలు ప్రతి సబ్జెక్టులో 2 శాతంతో 25 కనీస మార్కులు సాధిస్తే ఐఐటీల్లో సీట్ల పోటీకి అర్హత పొందినట్టేనని విశ్లేషిస్తున్నారు. పేపర్‌ విధానం, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ ప్రకారం వచ్చే మార్కులకు ర్యాంకులను జేఈఈ అధ్యాపకులు లెక్కగట్టారు.

చదవండి: ఎన్‌ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు

ఎన్ని మార్కులు వస్తే, ఎంత ర్యాంకు వచ్చే అవకాశం (అంచనా) :

ఎన్ని మార్కులు  

ఎంత ర్యాంకు

350–300

1–10

330–280

10–100

200–280

100–1000

150–200

1000–4000

100–150

4000–10000

100–80

 10000–20000

Jee Advanced 2022: ఇన్ని మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశం

Published date : 11 Sep 2022 06:05PM

Photo Stories