JEE 2021-22: జేఈఈలో 2021–22 ముందు పాసైన వారికి అవకాశం ఇవ్వాలి: కేఎన్‌వీ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విద్యా సంస్థలైన ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్‌ఐటీ తదితర వాటిల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ పరీక్షకు 2021–22 సెప్టెంబర్ ముందు పాసైన అభ్యర్థులు అనర్హులని కేంద్ర విద్యాశాఖ ప్రకటించడం దారుణమని కుల నిర్మూలన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాపని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
కోవిడ్–19 పరిస్థితులతో దాదాపు మూడేళ్లపాటు విద్యావ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని, విద్యార్థులు సైతం తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో 2021–22 సెప్టెంబర్ కంటే ముందు చదివిన విద్యార్థులకు జేఈఈలో అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. ఈ వ్యవహారం కుట్రపూరితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
Published date : 14 Mar 2024 11:20AM