ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా జూలై 26న జేఈఈ మెయిన్–2 రెండో రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
అంతా ఎన్‌సీఈఆర్‌టీ స్టైలే!
అనేక ప్రాంతాల్లో వర్షం ఉన్నప్పటికీ విద్యార్థులు పరీక్షకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరీక్షపై విద్యార్థులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. National Council for Educational Research and Training (NCERT) సిలబస్ నుంచి ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు తెలిపారు. రాష్ట్ర సిలబస్‌తో సన్నద్ధమైన విద్యార్థులు ఈ తరహా ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వలేకపోయినట్టు చెప్పారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో సన్నద్ధమైన విద్యార్థులు మాత్రం ప్రశ్నపత్రంపై సంతృప్తి వ్యక్తం చేశారు.