JEE Advanced 2023: రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ ఇదే.. ఈసారి అప్లికేషన్లు ఇలా..
రిజిస్ట్రేషన్ చేయించుకున్న అభ్యర్థులు పరీక్ష ఫీజును 5వ తేదీలోగా చెల్లించాలి. దీనికి సంబంధించిన సమాచార బులిటెన్‌ను ఐఐటీ గౌహతి విడుదల చేసింది. ఈ సంస్థ 2023 జూన్ 4వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనుంది. గత నెలలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 16 వేల సీట్లు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐఐటీ అడ్వాన్స్‌డ్ కాస్తా కఠినంగానే ఉండే అవకాశముంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
చదవండి: JEE Advanced: అడ్వాన్స్‌డ్‌నూ అధిగమించొచ్చు!.. అర్హత మార్కుల తీరు ఇలా..
జూన్ 18న ఫైనల్ కీతోపాటే ఫలితాలు విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 25 నుంచి 31 వరకు నిర్వహించారు, రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగింది. ఈ ఫలితాలను ఏప్రిల్ 29న విడుదల చేశారు. మెయిన్స్ ద్వారా అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది అర్హత సాధిస్తున్నా, పరీక్ష రాసేవాళ్లు మాత్రం 1.5 లక్షల మందే ఉంటున్నారు. ఈసారి మెయిన్స్‌కు ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. కోవిడ్ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ఎక్కువమంది దరఖాస్తు చేశారు. దీన్నిబట్టి అడ్వాన్స్‌డ్‌కు కూడా దరఖాస్తులు పెరిగే వీలుందని భావిస్తున్నారు.
చదవండి: JEE Main & Advanced: ఏటా తగ్గిపోతున్న అభ్యరులు! కారణాలివే..