Skip to main content

Telangana Inter Exams : ఇంటర్‌ పరీక్షల రీషెడ్యూల్ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలను రీషెడ్యూల్‌ చేసినట్లు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.
Telangana Logo

అక్టోబ‌ర్ 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అక్టోబర్‌ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31.. 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

ఈ నెల 25న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 26న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 27న మాథ్స్‌ పేపర్‌-1ఏ, బోటని పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1, 28న మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1, 31న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 1న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 2న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి. 

Inter Exams Dates

తెలంగాణ ఇంట‌ర్ స్ట‌డీ మెటీరియ‌ల్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్..మొద‌లైన వాటి కోసం కోసం క్లిక్ చేయండి

Published date : 08 Oct 2021 06:55PM

Photo Stories