సంస్కృతం సబ్జెక్ట్ తప్పనిసరి కాదు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంటర్‌లో సంస్కృతం ద్వితీయ భాషగా ఎంచుకోవచ్చని, ఇది కేవలం సూచనగానే పరిగణించాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యా కమిషనర్ శనివారం స్పష్టత ఇచ్చారు.
ఇంటర్‌లో సెకండ్ లాంగ్వేజీ కింద సంస్కృతాన్ని తప్పనిసరి చేసినట్లు వస్తున్న వార్తలు సరికాదని, సెకండ్ లాంగ్వేజీ కింద ఈ భాషను ఎంచుకునే అవకాశాన్ని మాత్రమే కల్పించినట్లు కమిషనర్ వివరించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిమాండ్‌ను తెలుసుకునేందుకు మాత్రమే సర్క్యులర్ ఇచ్చినట్లు వివరించారు.
Published date : 12 Jul 2021 03:51PM