Skip to main content

నేడు ఇంటర్ సెకండియర్– 2021 ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పూర్తయినప్పటికీ.. కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్‌ (మే 5 నుంచి 23 వరకు) ప్రకారం జరగలేదు. ఆపై సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఛాయారతన్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్‌, ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ ప్రాక్టికల్స్‌ మార్కుల ఆధారంగా ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కాగా, 2021 మార్చి ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు మొత్తం 10,32,469 మంది విద్యార్థులు రిజిస్టర్‌ అయ్యారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్థులు 5,12,959 మంది, సెకండియర్‌ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు.

ఫలితాల కోసం కొన్ని వెబ్‌సైట్లు
www.sakshieducation.com
www.examresults.ap.nic.in
www.results.bie.ap.gov.in
www.bie.ap.gov.in

చ‌ద‌వండి: 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు

చ‌ద‌వండి: వైద్య విద్యలో ప్రవేశాలు: 2024 వరకూ కేంద్ర కౌన్సెలింగ్లో చేరలేం..!

చ‌ద‌వండి: ఆగస్టులో స్కూళ్లకు పిల్లలు వచ్చే నాటికి మొత్తం నాడు–నేడు పనుల పూర్తి
Published date : 23 Jul 2021 02:32PM

Photo Stories