Skip to main content

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఆగస్టులో.. పరీక్షల సమయం గంటన్నరకు కుదింపు!

సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలను నిర్వహించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
సెకండియర్‌ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షల్లోని మార్కులను ప్రాతిపదికగా తీసుకొని పాస్‌ చేశారు. మరి ఫస్టియర్‌ విద్యార్థులకు ఏ ప్రాతిపదిక లేకపోవడం, 35 శాతం మార్కులు తీసుకోవడానికి కొందరు విద్యార్థులు విముఖంగా ఉండటంతో పరీక్షల నిర్వహణకే విద్యాశాఖ మొగ్గు చూపుతోంది. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది.

లె లంగాణ ఇంటర్మీడియెట్‌ 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, బిట్‌ బ్యాంక్స్, ప్రీవియస్‌ పేపర్లు, మోడల్‌ పేపర్లు, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి. 

అయితే తాజాగా పరీక్షల సమయాన్ని కుదించాలని విద్యాశాఖ యోచిస్తోంది. గతంలో సమయం మూడు గంటలు ఉండగా, కరోనా నేపథ్యంలో గంటన్నరకు కుదించాలని యోచిస్తున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఫస్టియర్‌ విద్యార్థులకు మాత్రం పరీక్షలను రద్దు చేసి, సెకండియర్‌కు ప్రమోట్‌ చేశారు. ఒకవేళ ఈ ఏడాది మళ్లీ వైరస్‌ విజృంభించి మరోసారి పరీక్షలను రద్దు చేయాల్సి వస్తే పరిస్థితి గందరగోళంగా మారనుంది. అదీగాక వీరికి మార్కులు కేటాయించడమూ కష్టమే. అందువల్ల ప్రస్తుతం కరోనా ఉధృతి తక్కువగా ఉండటంతో సెకండియర్‌ విద్యార్థులకు వచ్చే నెల్లో ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రశ్నపత్రాలను కూడా సులువుగా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి మళ్లీ ఫీజులు చెల్లించనవసరం లేకుండానే, గతంలో చెల్లించిన వారికి అవకాశం ఇవ్వనున్నా రు. గతంలో ఫీజు చెల్లించని వారు ఇప్పుడు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వీటిపై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది.
Published date : 19 Jul 2021 04:26PM

Photo Stories