ఇంటర్ ఫస్టియర్ ఆఫ్‌లైన్ చేరికలు చెల్లుబాటు కావు: ఇంటర్ బోర్డు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌లోకి ఆఫ్‌లైన్‌లో విద్యార్థులను చేర్చుకున్నారని,
ఈ చేరికలను బోర్డు ఆమోదించబోదని ఇంటర్మీడియెట్ బోర్డు సోమవారం స్పష్టం చేసింది. ఇప్పటివరకు అడ్మిషన్లపై బోర్డు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని పేర్కొంది. 2021–22 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నామని, ఈ అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని పేర్కొంది.
చదవండి: కరోనాతో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు భరించలేక ప్రభుత్వ బడులకు విద్యార్థులు
చదవండి: ‘దోస్త్ – 2021’ గడువు జూన్ 28 వరకు పొడిగింపు
చదవండి: కరోనాతో ప్రైవేటు స్కూళ్ల ఫీజులు భరించలేక ప్రభుత్వ బడులకు విద్యార్థులు
చదవండి: ‘దోస్త్ – 2021’ గడువు జూన్ 28 వరకు పొడిగింపు
Published date : 27 Jul 2021 03:31PM