Skip to main content

బ్రేకింగ్ న్యూస్‌: ఏపీ ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు విడుదల..

సాక్షి, అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ ఫలితాలు జూలై 23వ తేదీన సాయంత్రం 4 గంటల‌కు విడుదలయ్యాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పూర్తయినప్పటికీ.. కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్‌ (మే 5 నుంచి 23 వరకు) ప్రకారం జరగలేదు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇంట‌ర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌ అయినట్లు ఆయన ప్రకటించారు. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దు చేశామని, కరోనా నిబంధనలు పాటించి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.
 
విద్యార్థులకు ఈ ఫలితాలపై అసంతృప్తి ఉంటే..
పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన మూడు సబ్జెక్ట్‌ల యావరేజ్‌కి 30 శాతం.. ఇంటర్ మొదటి ఏడాదిలో ప్రతిభకి 70 శాతం వెయిటేజ్‌తో ఫలితాలు ప్రకటించామని ఆయన పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన  విద్యార్థులను పాస్ చేశామని తెలిపారు. విద్యార్థులకు ఈ ఫలితాలపై అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామన్నారు.
 
పదవ తరగతి ఫలితాలను..
మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్ మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. అడ్మిషన్లలో అవకతవకలకి పాల్పడే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ హెచ్చరించారు.
 
 
వీటి ఆధారంగానే ఇంటర్‌ సెకండియర్ ఫ‌లితాలు..
ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఛాయారతన్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ ప్రాక్టికల్స్‌ మార్కుల ఆధారంగా ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. కాగా, 2021 మార్చి ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలకు మొత్తం 10,32,469 మంది విద్యార్థులు రిజిస్టర్‌ అయ్యారు. వీరిలో ఫస్టియర్‌ విద్యార్థులు 5,12,959 మంది, సెకండియర్‌ విద్యార్థులు 5,19,510 మంది ఉన్నారు. ఫ‌లితాల కోసం www.sakshieducation.com లో చూడొచ్చు.

జూలై 25న ఇంటర్, డిగ్రీ ప్రవేశ పరీక్ష..పూర్తి వివ‌రాలు ఇలా..

నెలాఖరులోగా ఫస్టియర్‌ అడ్మిష‌న్లు..

అక్టోబర్ నెలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

Published date : 22 Jul 2021 04:49PM

Photo Stories