ICET 2022: అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలు ఇవే..
Sakshi Education
MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి ICET 2022 కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 9న మొదలైంది.
ఇప్పటి వరకూ 14,284 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్టు తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 10 నుంచి 13 వరకూ జరుగుతుందని, స్లాట్ బుక్ చేసు కున్న వారు అక్టోబర్ 15వ తేదీలోగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద ఎంబీఏ సీట్లు 20,481, ఎంసీఏ సీట్లు 2370 ఉన్నాయని వెల్లడించారు.
చదవండి:
డిగ్రీ తర్వాత ఎక్కువ మంది చేరుతున్న కోర్సు.. కారణం ఇదే..
Higher Education: ఎంబీఏలో చేరాలా.. లేదా ఎంసీఏ బెటరా?!
Published date : 10 Oct 2022 02:24PM